Site icon NTV Telugu

World Cup Final 2023: వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ను తిలకించిన ప్రధాని నరేంద్ర మోదీ

Modi 3

Modi 3

2023 వన్డే ప్రపంచకప్‌లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోదీ స్టేడియంలో కూర్చొని వీక్షించారు. ప్రధాని వెంట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, గుజరాత్ గవర్నర్ కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే.. షారుఖ్ ఖాన్‌తో పాటు పలువురు బాలీవుడ్ స్టార్స్‌తో సహా చాలా మంది పెద్ద సెలబ్రిటీలు టైటిల్ మ్యాచ్ చూడటానికి వచ్చారు.

Read Also: World Cup Final 2023: ఆరోసారి విశ్వవిజేతగా ఆస్ట్రేలియా.. ఫైనల్లో ఇండియాపై ఆసీస్ గెలుపు

2023 ప్రపంచకప్‌లో టీమిండియా వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంది. అయితే ఈ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఓడిపోయింది. లబుషేన్, రాబిన్ హెడ్‌లు నిలదొక్కుకుని ఆస్ట్రేలియాను విజయానికి చేరువ చేశారు. లబుషేన్ అర్ధసెంచరీ, రాబిన్ హెడ్ సెంచరీతో చెలరేగిపోయారు. ఈ టోర్నీలో వరుస మ్యాచ్‌ల్లో విజయం సాధించిన టీమిండియా.. ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా పేలవ ప్రదర్శన చూపించింది.

Read Also: Bullet Bhaskar: జబర్దస్త్ షోలో గుండు కొట్టించుకున్న బుల్లెట్ భాస్కర్.. ఖుష్బుతో ఊహించని గొడవ.. ఏమైందంటే?

తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 240 పరుగులు చేసింది. భారత్ తరఫున అత్యధికంగా.. కేఎల్ రాహుల్ 66 పరుగులు చేశాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 54 పరుగులు, రోహిత్ శర్మ 47 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలింగ్ దాటికి భారత్ బ్యాటర్లు చేతులెత్తేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ 10 ఓవర్లలో 55 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ తలో రెండు వికెట్లు తీశారు. గ్లెన్ మాక్స్‌వెల్, ఆడమ్ జంపాకు చెరో వికెట్ దక్కాయి.

Exit mobile version