NTV Telugu Site icon

INDvsAUS Test: భారత్-ఆసీస్ చివరి టెస్టుకు మోడీ, ఆస్ట్రేలియా ప్రధాని!

Aus1

Aus1

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది. ఫిబ్రవరి 9న నాగ్‌పూర్‌తో జరిగే తొలి టెస్టుతో ఈ సిరీస్ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే భారత గడ్డపై అడుగుపెట్టిన ఆసీస్‌ జట్టు.. బెంగళూరులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రైనింగ్‌ క్యాంప్‌లో ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. అదే విధంగా రోహిత్‌ సారథ్యంలోని భారత జట్టు కూడా శుక్రవారం నుంచి తమ ప్రాక్టీస్‌ను ప్రారంభించింది. ఇకపోతే, ఈ సిరీస్‌లో ఆఖరి టెస్టు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యక్షంగా వీక్షించున్నట్లు తెలుస్తోంది. మోడీతో పాటు ఆస్ట్రేలియా దేశ ప్రధాని ఆంథోనీ అల్బనీస్ కూడా ఈ మ్యాచ్‌కు హాజరకానున్నట్లు సమాచారం. మార్చి 9 నుంచి అహ్మదాబాద్ టెస్టు ప్రారంభం కానుంది.

సిరీస్ కోసం ఆసీస్ మాస్టర్ ప్లాన్

ఫిబ్రవరి 9న తొలి టెస్ట్ నాగ్‌పూర్‌లో జరగనుండగా ఆస్ట్రేలియా మాత్రం నాలుగు రోజుల సన్నాహక క్యాంప్‌ను బెంగళూరులో ఏర్పాటు చేసుకుంది. దీనికి కారణం ఆ టీమ్ కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్, స్పిన్ కన్సల్టెంట్ డానియల్ వెటోరీ. ఈ ఇద్దరికీ ఐపీఎల్ టీమ్ ఆర్సీబీతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో బెంగళూరు దగ్గరలోని ఆలూర్‌లో ఆస్ట్రేలియా ప్రత్యేకంగా తమకు కావాల్సినట్లుగా స్పిన్ పిచ్‌లను ఏర్పాటు చేయించుకొని మరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఇండియన్ టీమ్ లోని అశ్విన్, జడేజా, కుల్దీప్, అక్షర్ లాంటి స్పిన్నర్లు.. షమీ, సిరాజ్‌లాంటి పేసర్లను ఎదుర్కోవడానికి తగిన పిచ్‌లపై ఆస్ట్రేలియా ప్రాక్టీస్ చేయాలని నిర్ణయించింది. వీటిలో కాస్త తక్కువ స్పిన్ అయ్యే పిచ్‌లు, బాగా టర్న్ అయ్యే పిచ్‌లు, వేరియబుల్ బౌన్స్ ఉండే పిచ్‌లు ఉన్నాయి. నాగ్‌పూర్, ఢిల్లీ, అహ్మదాబాద్‌లలో స్పిన్ పిచ్‌లే ఎదురవుతాయని ఆస్ట్రేలియా ఇలాంటి పిచ్‌లపై ప్రాక్టీస్ చేస్తోంది.

నాలుగు టెస్టుల షెడ్యూల్‌

1. ఫిబ్రవరి 9- 13: నాగ్‌పూర్‌
2. ఫిబ్రవరి 17- 21: ఢిల్లీ
3. మార్చి 1-5: ధర్మశాల
4. మార్చి 9- 13: అహ్మదాబాద్‌

Also Read: Jallikattu Protest : తమిళనాడులో ఉద్రిక్తత.. జల్లికట్టుకు అనుమతి ఇవ్వలేదని ఆందోళన

Show comments