NTV Telugu Site icon

PM Modi: రేపు హైదరాబాద్ కు మరోసారి ప్రధాని మోడీ

Modi

Modi

PM Modi: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అన్ని పార్టీలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కూడా తమ అగ్రనేతలను ఆహ్వానిస్తూ ప్రచార హోరును పెంచింది. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రేపు మరోసారి రాష్ట్రానికి రానున్నారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగే మాదిగ విశ్వరూప బహిరంగ సభ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.

Read Also: Superstar Krishna Statue: విజయవాడలో సూపర్‌ స్టార్‌ కృష్ణ విగ్రహం.. ఆవిష్కరించిన కమల్‌ హాసన్‌

ఇక, రేపు సాయంత్రం 4 గంటల 45 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. 5 గంటల నుండి 5.40 వరకు పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. అనంతరం 6 గంటలకు బేగంపేట నుంచి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇక, మాదిగ ఉప కులాల (మాదిగ విశ్వరూప బహిరంగ సభ) బహిరంగ సభలో ఎస్సీ కులాల వర్గీకరణపై మోడీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు బీజేపీలోని పలు వర్గాలు తెలిపాయి. ప్రధాని మోడీ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని రాక నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రేపు ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పలు చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.

Read Also: Road Accident: గోరఖ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆగి ఉన్న బస్సును ఢీ కొన్న ట్రక్కు.. ఆరుగురు మృతి

అయితే, పరేడ్ గ్రౌండ్స్‌లో రేపు నిర్వహించనున్న మాదిగ-ఉపకులాల విశ్వరూప సభ’కు దూరంగా ఉండాలని బీజేపీ ఎస్సీ మోర్చా చూస్తుంది. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అధ్యక్షతన ఈ సభ జరుగనున్నది. ఇక, తమను కీలక నిర్ణయాల్లో ఇన్వాల్వ్ చేయకపోవడంతో బీజేపీ దళిత నేతలు ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తుంది. అయితే సభకు దూరంగా ఉంటే ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉందని పలువురు దళిత నేతలు భావిస్తున్నారు. అలా కాదని సభలో పాల్గొంటే మాల సామాజిక వర్గం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుందని బీజేపీ ఎస్సీ మోర్చా నేతలు చెబుతున్నారు.