Narendra Modi : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రస్తుతం మారిషస్ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా మారిషస్ లోని హిందువులను కలుసుకున్నారు. అందులో మెజార్టీ ప్రజలు భోజ్ పురి వాళ్లే ఉండటంతో వారిని ఉద్దేశించి ప్రధాని భోజ్ పురిలో బాగున్నారా అంటూ పలకరించారు. బీహార్ తో మీకున్న బంధాన్ని అర్థం చేసుకున్నానంటూ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా బీహార్ ఫేమస్ వంటకం అయిన మఖానా గురించి మాట్లాడారు. “ఇప్పుడు అందరూ బీహార్ వంటకం మఖానా గురించే మాట్లాడుకుంటున్నారు. అతి త్వరలోనే ప్రపంచ మెనూలో మఖానా చేరుతుందని” జోస్యం చెప్పారు. బీహార్ కు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా గుర్తింపు తెస్తోందన్నారు.
Read Also : TTD: టీటీడీ దర్శనాలపై ఏపీ సీఎంకి మంత్రి కొండా సురేఖ లేఖ
ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లో విద్య లేనప్పుడే బీహార్ లో నలంద యూనివర్సిటీ ఉందని.. దాన్ని తాము వచ్చాక పునరుద్ధరించినట్టు గుర్తు చేశారు. మారిషస్ ను ను మినీ ఇండియాగా అభివర్ణించారు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల నుంచి ఇక్కడకు వచ్చిన వారిలో ఇండియన్స్ ఎక్కువగా ఉన్నట్టు చెప్పారు. బాలీవుడ్ లోని ఫేమస్ పాటలను ఇక్కడే షూట్ చేశారని.. ఈ ప్రాంతానికి వస్తే సొంత ప్రాంతానికి వచ్చిన ఫీలింగ్ కలుగుతుందంటూ ప్రధాని అభివర్ణించారు.
Read Also : Amrutha: ప్రణయ్ పరువు హత్య తుదితీర్పుపై స్పందించిన అమృత..