Site icon NTV Telugu

PM MODI: నేడు తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన

Modi

Modi

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కమలం పార్టీ దూకుడు పెంచింది. ఇప్పటికే బీజేపీ తరపున స్టార్ క్యాంపెయినర్ లను రంగంలోకి దించి జోరుగా ఎన్నికల ప్రచారాన్ని స్టార్ట్ చేసేందుకు రెడీ అయింది. నేడు రాష్ట్రానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ రానున్నారు. ఎన్నికల షెడ్యూల్ వచ్చాక మొదటిసారి మోడీ తెలంగాణకు వస్తున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు.

Read Also: Gold Price Today: పసిడి ప్రియులకు గూడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!

అయితే, ఇవాళ (మంగళవారం) ఎల్బీ స్టేడియంలో బీజేపీ బీసీ ఆత్మ గౌరవం పేరుతో బహిరంగ సభ నిర్వహిస్తుంది. ఈ సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనే దానిపై సర్వాత్ర ఆసక్తికంగా మారింది. నేడు మోడీ సభకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం హాజరుకానున్నారు. ఇక ప్రధాని నేటి సాయంత్రం బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా సాయంత్రం ఎల్బీ స్టేడియం చేరుకుంటారు. బీజేపీ నిర్వహించే బీసీ గర్జన సభలో మోడీ 5: 25 గంటల నుంచి 6: 15 నిమిషాల వరకు ఉండనున్నారు. తిరిగి సాయంత్రం 6.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ నుంచి ఢిల్లీకి వెళ్లిపోతారు.

Read Also: Assembly Election: ఛత్తీస్‌గఢ్-మిజోరంలో నేడు ఓటింగ్.. గెలుపెవరిదో?

ఇక, ఈ సభకు లక్ష మంది వరకు తరలించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం చూస్తుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి జనాలను తరలించడానికి కమలం పార్టీ నేతలకు రెడీ అయ్యారు. ఇక, ప్రధాని మోడీ ఇవాళ్టి సభ తర్వాత మళ్లీ 11వ తేదీన పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే మాదిగ ఉపకులాల విశ్వరూప మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు.

Exit mobile version