మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నేడు వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా, తొలి ట్రెండ్‌లో మహారాష్ట్రలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. అంతే కాదు ఎన్డీయే కూటమి మెజారిటీని దాటేస్తున్నట్లు కనిపిస్తోంది. కాగా, జార్ఖండ్‌లో జేఎంఎం 30 స్థానాలకుపైగా ఆధిక్యంలో ఉంది. ఈరోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు మధ్య ప్రధాని మోడీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లనున్నారు. సాయంత్రం 7 గంటలకు ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
READ MORE: Robert Vadra: ప్రియాంక గెలుపుపై భర్త రాబర్ట్ వాద్రా ఏమన్నారంటే..!
మహారాష్ట్రలో ప్రారంభ ట్రెండ్‌లలో మహాయుతి భారీ మెజారిటీతో గెలుపొందడంతో శివసేన కార్యకర్తలు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నివాసం వెలుపల సంబరాలు జరుపుకున్నారు. అదే సమయంలో, బారామతి అసెంబ్లీ ఎన్నికల్లో అజిత్ పవార్ భారీ మెజారీలో దూసుకుపోతుండటంతో ఆయన మద్దతుదారులు క్రాకర్లు పేల్చడం ప్రారంభించారు. ఢిల్లీ బీజేపీ ప్రధాన కార్యాలయంలో కూడా వేడుకకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. అక్కడ కూడా జిలేబీలు తయారు చేయడం ప్రారంభించారు.
READ MORE: Bihar By Election Results: బీహార్ ఉప ఎన్నికల ఫలితాల్లో సత్తా చాటిన ఎన్డీఏ..
ఈసారి మహారాష్ట్రలో రికార్డు స్థాయిలో ఓటింగ్..
మహారాష్ట్ర అసెంబ్లీలోని 288 స్థానాలకు 4136 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరి భవితవ్యం ఈరోజు తేలాల్సి ఉంది. ఓట్ల లెక్కింపు ప్రారంభం కాగా మరికొద్ది గంటల్లో లెక్కలు తేలనున్నాయి. ఈసారి మహారాష్ట్రలో రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. ఈసారి మహారాష్ట్రలో 65.11 శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019 సంవత్సరంలో జరిగిన ఓటింగ్ కంటే నాలుగు శాతం ఎక్కువ. ఈసారి, మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు ఒకే దశలో నవంబర్ 20న పోలింగ్ జరిగింది.