PM Modi: తెలంగాణలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పర్యటన ఖరారు అయింది. అక్టోబర్ ఒకటిన తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోడీ వస్తున్నారు. హైదరబాద్ లో అధికారిక కార్యక్రమం.. సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ ప్రారంభం, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్ట్ ల శంఖుస్థాపన చేయనున్నారు. అలాగే, మహబూబ్ నగర్ లో బీజేపీ బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు. ఇక, ఒకటవ తేదీ మధ్యాహ్నం 1.30 గంటలకి హైదారాబాద్ లోని బేగం పేట ఎయిర్ పోర్ట్ కి మోడీ రానున్నారు. 1.45 నుంచి 2.15 వరకు హైదరాబాద్ లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. 3.05 గంటలకు మహబూబ్ నగర్.. 3.15 నుంచి 4.15 వరకు బీజేపీ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ఆయన పాల్గొననున్నారు.
PM Modi: తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన.. షెడ్యూల్ ఇదే..!
Show comments