NTV Telugu Site icon

PM MODI: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీకి ప్రధాని మోడీ ఫోన్.. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపై చర్చలు

Modi Phone

Modi Phone

PM MODI: ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆ వివాదంపై ప్రధాని మోడీ ఈరోజు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీతో ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో ఘర్షణల ఫలితంగా ఎదురవుతున్న సవాలు పరిస్థితులపై నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఆ ప్రాంతంలో శాంతి మరియు సుస్థిరతను పునరుద్ధరించాలనే ఉమ్మడి లక్ష్యంతో, మరింత తీవ్రతరం కాకుండా నిరోధించడానికి మోడీ, రైసీ వ్యూహాలపై చర్చించారు. ఇదిలా ఉంటే.. చబహార్ ఓడరేవు సహా ద్వైపాక్షిక సహకారంలో పురోగతిని స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ సోషల్ మీడియాలో తెలిపారుజ మరోవైపు విదేశాంగ మంత్రి జైశంకర్ ఇజ్రాయెల్-హమాస్ వివాదానికి సంబంధించి ఆదివారం ఇరాన్ విదేశాంగ మంత్రి హుస్సేన్ అమీర్-అబ్దుల్లాహియాన్‌లతో ఫోన్‌లో మాట్లాడారు.

Read Also: Azharuddin: అజారుద్దీన్ కు మల్కాజ్‌గిరి కోర్టులో ఊరట..

అక్టోబర్ 7 నుంచి ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం జరుగుతోంది. అక్టోబర్ 7 ఉదయం హమాస్ రాకెట్ దాడి ద్వారా ఇజ్రాయెల్‌లోకి చొరబడింది. ఆ తర్వాత.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాట్లాడుతూ.. మేము యుద్ధం చేస్తున్నాము, అందులో మేము గెలుస్తామన్నారు. ఈ దాడిలో ఇప్పటివరకు 1,400 మంది ఇజ్రాయెల్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. హమాస్ కూడా 200 మందికి పైగా మృతిచెందారు. అటు పాలస్తీనాకు చెందిన 10 వేల మందికి పైగా మరణించినట్లు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది.

Read Also: Kotabommali PS Teaser: శ్రీకాంత్ నట విశ్వరూపం.. అదిరిపోయిన కోటబొమ్మాళీ టీజర్