NTV Telugu Site icon

PM Modi US Visit : యూఎస్‌లో ప్రధానికి ఘన స్వాగతం.. కాసేపట్లో ‘మోడీ అండ్ అమెరికా’

Pm Modi Us Visit

Pm Modi Us Visit

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన భారతీయ సంఘం కార్యక్రమంలో ప్రధాని తన ఆనందాన్ని పంచుకున్నారు. వివిధ రంగాల్లో సానుకూల ప్రభావం చూపిన భారతీయ సమాజం అమెరికాలో తనదైన గుర్తింపును సృష్టించుకుందని ట్వీట్ చేశారు. వారితో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు బిడెన్ స్వస్థలమైన విల్మింగ్టన్‌లో శనివారం క్వాడ్ లీడర్స్ సమ్మిట్ జరిగింది. ఇందులో భద్రతా సహకారం నుంచి సాంకేతికత భాగస్వామ్యం వరకు అనేక అంశాలపై చర్చించారు. సెప్టెంబరు 22, ఆదివారం, భారత కాలమానం ప్రకారం రాత్రి 9:30 గంటలకు, తాను న్యూయార్క్ నగరంలో నిర్వహించే కార్యక్రమంలో ప్రసంగిస్తానని ప్రధాని మోడీ ఎక్స్ లో పోస్ట్ చేశారు.

READ MORE: AP CM Chandrababu: లడ్డూ వివాదంపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

ఈరోజు న్యూయార్క్‌లో జరిగే భారతీయ కమ్యూనిటీ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తారు. లాంగ్ ఐలాండ్‌లో ఏర్పాటు చేసిన ‘మోడీ అండ్ అమెరికా’ అనే కార్యక్రమానికి భారతీయ కమ్యూనిటీ నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఇందులో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ కార్యక్రమానికి ముందు.. నసావు కొలీజియంలో చాలా కార్యకలాపాలు జరిగాయి. అక్కడ భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రజలు మోడీకి ఘన స్వాగతం పలికారు. వేదిక వద్ద కళాకారులు వివిధ భారతీయ సంప్రదాయ నృత్య రీతులను ప్రదర్శించారు.