ఎన్నికలకు సమయం దగ్గర పడుతుంది. ఈ క్రమంలో.. ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్నారు. అందులో భాగంగానే.. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించారు. అక్కడ ఎన్డీఏ కూటమిని గెలిపించాలని ఆయన కోరారు. మరోవైపు.. కేంద్రంలో మరోసారి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జూన్ 4 తేదీన ఏపీలో, ఢిల్లీలో బీజేపీ జెండా రెపరెపలాడుతుందని అన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్తో వికసిత ఆంధ్రప్రదేశ్ – వికసిత భారత్ సాధ్యం అన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసం కోసం కేంద్ర ప్రభుత్వం పని చేస్తుందని మోడీ తెలిపారు.
Ex CM: మాజీ ముఖ్యమంత్రి ఇలా అయిపోయారేంటి..!?
అనంతరం.. కొత్తపల్లి గీతను ప్రధాని మోడీ ఆశీర్వదించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఆమె సేవల్ని ప్రసంశించారు. మోడీ అనకాపల్లి పర్యటనలో సోమవారం ఈ అరుదైన సంఘటన చోటుచేసుకుంది. అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార సభలో అరకు పార్లమెంట్ బీజేపీ కూటమి అభ్యర్థి కొత్తపల్లి గీతకు ప్రత్యేక గుర్తింపు లభించింది. సాక్షాత్తు ప్రధాని మోడీ కొత్తపల్లి గీతను అరకు ఎంపీగా గెలిపించాలని కోరడంతో పాటు గీత తలపై చేయి పెట్టి ఆశీర్వదించడం గమనార్హం.
CM Jagan: సీఎం జగన్ రేపటి ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇదే..
ప్రధాని నరేంద్ర మోడీ దగ్గర ప్రత్యేక గుర్తింపు ఉన్న కొత్తపల్లి గీత విజయాన్ని ఆకాంక్షిస్తూ ఆయనే ఆశీర్వదించడం అభినందనీయం. అదే విధంగా మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు కూడా కొత్తపల్లి గీత కోసం ప్రత్యేకంగా చెప్పడం అందరిలో ఆసక్తి నెలకొంది. గతంలో ఎంపీగా పని చేసిన గీతను తిరిగి ఎన్నుకుంటే అరకు పార్లమెంట్ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని, గీత సమర్ధురాలని చంద్రబాబు కొనియాడారు. దీంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు.