Site icon NTV Telugu

Onion Price : భారీగా పడిపోయిన ఉల్లి ధర.. వినియోగదారులు హ్యాపీ.. రైతుల్లో ఆందోళన

New Project 2023 12 20t123016.548

New Project 2023 12 20t123016.548

Onion Price : పెరుగుతున్న ఉల్లి ధరలను నియంత్రించేందుకు మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలు సఫలమయ్యాయి. ఉల్లి ఎగుమతులపై నిషేధం తర్వాత 2 వారాల లోపే ఉల్లి ధరలు సగానికి పడిపోయాయి. డిసెంబర్ 7న ఉల్లి ఎగుమతిపై మోడీ ప్రభుత్వం నిషేధం విధించింది. దీని తర్వాత హోల్‌సేల్ మార్కెట్‌లలో ఉల్లి ధరలు దాదాపు 50శాతం పడిపోయాయి. రానున్న వారాల్లో ధరలు స్థిరంగా ఉంటాయని లేదా స్వల్పంగా తగ్గుతాయని వ్యాపారులు తెలిపారు. లాసల్‌గావ్ AMPC వద్ద ఉల్లి సగటు హోల్‌సేల్ ధర కిలోకు రూ. 20-21కి పెరిగింది. ఎగుమతి నిషేధం విధించబడటానికి ముందు ఇది కిలోకు రూ. 39-40గా ఉండేది.

Read Also:Andhrapradesh: ఒమిక్రాన్‌ కంటే వేగంగా కొత్త వేరియంట్ వ్యాప్తి.. అప్రమత్తమైన వైద్యశాఖ

డిసెంబర్ 7 నుంచి ఉల్లి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. దీంతో వినియోగదారులకు ఊరట లభించగా, రైతులు మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఉల్లి ఎగుమతి నిషేధం తర్వాత లాసల్‌గావ్, నాసిక్ జిల్లాల్లోని 17 మార్కెట్ కమిటీలలో ఉల్లి ధర తగ్గడం ప్రారంభమైంది. ఉల్లి ధర క్వింటాల్‌కు రూ.3 వేల నుంచి రూ.1500కి తగ్గింది. అసలు ధర కూడా భరించలేని స్థాయిలో ఉల్లి ధరలు పడిపోతున్నాయి. అందుకే నాసిక్ జిల్లా రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ధరలు పడిపోవడంతో రైతులు ఉల్లిని ఉచితంగా పంపిణీ చేస్తున్న వీడియోలు చాలా వైరల్ అయ్యాయి. ఒక నెల క్రితం కిలో ఉల్లి ధర రూ.35 కంటే ఎక్కువగా ఉంది. ఇప్పుడు హోల్‌సేల్ మార్కెట్‌లో కిలో రూ.20 కంటే తక్కువగా ఉంది.

Read Also:Telangana Assembly: రూ. 6,71,757 కోట్లకు చేరిన అప్పులు.. 42 పేజీలతో శ్వేతపత్రం విడుదల

రోజుకు సుమారు రూ. 6 నుండి రూ.7 కోట్ల నష్టం
నాసిక్ జిల్లా రైతుల ప్రకారం.. ఉల్లి ధరలు బాగా పడిపోవడంతో రూ. 150 నుండి 200 కోట్ల వరకు నష్టం వాటిల్లింది. ఇదే సమయంలో వ్యాపారులు, మార్కెట్ కమిటీలు కూడా భారీగా నష్టపోయాయి. లాసల్‌గావ్ ఎపిఎంసి మార్కెట్‌లో వించూర్, నిఫాద్, యోలా ఇతర మార్కెట్‌లో రోజువారీ వినియోగం 40,000 క్వింటాళ్లు కాగా, నాసిక్ జిల్లాలోని అన్ని మార్కెట్ కమిటీలలో మొత్తం 1.5 లక్షల క్వింటాళ్ల ఉల్లి నిల్వ ఉంది. ఒక్క లాసల్‌గావ్‌లోనే రైతులు ప్రతిరోజూ దాదాపు రూ.6 నుండి రూ.7 కోట్ల వరకు నష్టపోతున్నారు.

Exit mobile version