NTV Telugu Site icon

President Election 2022 Result Live Updates: భారత నూతన రాష్ట్రపతి ఎవరు?

228c84ff 5a34 4a9c A7f0 Af3c8768fd4e

228c84ff 5a34 4a9c A7f0 Af3c8768fd4e

President Poll Results Live | President of India Election Counting | Ntv Live

భారత అత్యున్నత పీఠం రాష్ట్రపతి పదవి. దీనిని అధిరోహించే నేత ఎవరో మరికొద్ది గంటల్లో తేలిపోనుంది. ఇవాళ రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. రాష్ట్రపతి ఎన్నికలో ఓట్ల లెక్కింపు కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. సాయంత్రం వరకు ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీయే అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం తలపడిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాల నుంచి బ్యాలెట్‌ బాక్సులను ఇప్పటికే పార్లమెంట్‌ హౌస్‌కు చేర్చారు. ద్రౌపది ముర్ముకు తగినంత మెజారిటీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని రాజకీయ పండితులు తేల్చిచెబుతున్నారు. పలు రాష్ట్రాల్లో కొందరు ప్రతిపక్ష పార్టీల సభ్యులు కూడా క్రాస్‌ ఓటింగ్‌తో ఆమె వైపు మొగ్గుచూపినట్లు సమాచారం. దీంతో ఆమె ఊహించినదాని కంటే అధిక మెజారిటీతో గెలుస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ముర్ము విజేతగా నిలిస్తే.. రాష్ట్రపతి పీఠమెక్కిన తొలి గిరిజన మహిళగా రికార్డు సృష్టిస్తారు.ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీకాలం ఈ నెల 24న ముగియనుంది. నూతన రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ అప్ డేట్ ఎప్పటికప్పుడు Live Updates ద్వారా మీకు అందిస్తుంది  ntvtelugu.com

 

The liveblog has ended.
  • 21 Jul 2022 08:35 PM (IST)

  • 21 Jul 2022 08:32 PM (IST)

    ద్రౌపది ముర్ముకు ప్రధాని అభినందనలు

    భారత 15వ రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ముకు అభినందనలు తెలిపారు ప్రధాని నరేంద్ర మోడీ.. ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతున్నా.. ద్రౌపది ముర్ము విజయం ఖాయమైన తర్వాత.. ముర్ము నివాసానికి వెళ్లిరు ప్రధాని నరేంద్ర మోడీ.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా... ఈ సందర్భంగా ముర్ముకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపిన ప్రధాని మోడీ.

  • 21 Jul 2022 08:04 PM (IST)

    భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

    భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఈ నెల 25వ తేదీన ప్రమాణస్వీకారం చేయనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు కొనసాగుతుండగా... ఇస్పటికే సగానికి పైగా ఓట్లు సాధించారు ద్రౌపది ముర్ము... దీంతో.. భారత తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా ముర్మురికార్డు సృష్టించారు.

  • 21 Jul 2022 06:00 PM (IST)

    ముందంజలో ద్రౌపది ముర్ము.. రెండో రౌండ్‌లోనే అదే దూకుడు

    రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలకు సంబంధించిన కౌంటింగ్‌ ప్రక్రియ కొనసాగుతోంది.. తొలి రౌండ్‌లో తిరుగులేని ఆధిక్యాన్ని కనబర్చిన ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము.. రెండో రౌండ్‌లోనూ అదే దూకుడు చూపించారు.. ఇప్పటి వరకు 10 రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేలకు సంబంధించిన ఓట్లను లెక్కించారు.. మొత్తం 1,138 ఎమ్మెల్యేల్లో ద్రౌపది ముర్ముకు 809 ఓట్లు, యశ్వంత్ సిన్హా కు 329 ఓట్లు వచ్చాయి.. ముర్ముకు వచ్చిన 809 ఎమ్మెల్యేల ఓట్ల విలువ 1,05,299గా ఉండగా.. సిన్హాకు వచ్చిన 329 ఓట్ల విలువ 44,276గా ఉంది.

  • 21 Jul 2022 05:18 PM (IST)

    ద్రౌపది ముర్ముకు అంచనాలకు మించిన భారీ మెజార్టీ..!

    రాష్ట్రపతి ఎన్నికల్లో అంచనాలకు మించిన భారీ మెజారిటీతో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలిచే అవకాశం ఉందంటున్నారు.. సుమారు 72 శాతం పైగానే ఓట్లను ద్రౌపది ముర్ము సాధిస్తారని అంచనా వేస్తున్నారు బీజేపీ నేతలు.. రాత్రి 8 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగే అవకాశం ఉంది..

  • 21 Jul 2022 04:15 PM (IST)

    తొలి రౌండ్ పూర్తి.. ముర్ముకు భారీ అధిక్యం..

    భారత రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించిన ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ ముగిసింది.. మొత్తం 748 మంది పార్లమెంట్‌ సభ్యుల ఓట్లను లెక్కించగా.. అందులో 15 మంది ఎంపీలు ఓట్లు చెల్లకుండా పోయాయి.. ఇక, ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు 540, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి.. ఈ ఓట్ల మొత్తం విలువ 5,23,600 కాగా.. అందులో ద్రౌపది ముర్ముకు లభించిన ఓట్ల విలువ 3,78,000కాగా, యశ్వంత్​ సిన్హాకు వచ్చిన ఓట్ల విలువ 1,45,600గా ఉంది. దీంతో.. ద్రౌపది ముర్ముకు భారీ అధిక్యం లభించింది.

  • 21 Jul 2022 03:12 PM (IST)

    చెల్లని ఎంపీల ఓట్లు 15

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.. అయితే, 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోయాయి.. దేశవ్యాప్తంగా వివిధ లోక్‌సభ స్థానాల నుంచి గెలిచినవారు, రాజ్యసభలో ఉన్న మేధావులు కూడా ఈ జాబితాలో ఉన్నారు.. ఏకంగా 15 మంది ఎంపీల ఓట్లు చెల్లకుండా పోవడం చర్చగా మారింది.. ప్రజాప్రతినిధులే ఈ మాదిరిగా ఓట్లు వేస్తున్నారు.. మరి, సామాన్యుల సంగతి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు అంటున్నారు..

  • 21 Jul 2022 02:18 PM (IST)

    వేగంగా ఎంపీ ఓట్ల లెక్కింపు

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా ఎంపీ ఓట్లు లెక్కిస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక ఎమ్మెల్యేల ఓట్లను లెక్కిస్తారు.

  • 21 Jul 2022 01:32 PM (IST)

    కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఎమ్.పి ఓటు విలువ 700, ఏపి ఎమ్.ఎల్.ఏ విలువ 159, తెలంగాణ ఎమ్.ఎల్.ఏ విలువ 132గా నిర్ణయించారు. మొత్తం ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్.పిలు, ఎమ్.ఎల్.ఏల సంఖ్య 4,754గా వుంది. ఓటు వేసిన మొత్తం 4,754 మంది ప్రజాప్రతినిధుల్లో, 763 ఎమ్.పిలు, 3991 మంది ఎమ్.ఎల్.ఏలు వున్నారని అధికారులు తెలిపారు. వివిధ కారణాలతో ఓటింగ్ లో పాల్గొనలేకపోయున ఎమ్.పి లు 8 మంది. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ఎన్నిక ఫలితం ప్రకటన రానుంది. ఎం.పి లు, ఎమ్.ఎల్.ఏ ల ఓట్ల ను వేరు చేసే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం మేఘాలయ బ్యాలట్ బాక్సులను తెరిచారు అధికారులు. అక్షర క్రమంలో అన్ని రాష్ట్రాల బ్యాలట్ బాక్సులను తెరచిన తర్వాత, ప్రారంభం కానుంది ఓట్ల లెక్కింపు.

     

  • 21 Jul 2022 01:12 PM (IST)

    కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఈసీ అధికారులు ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన బ్యాలెట్ బాక్సుల్ని తెరిచి ఓట్లను వేరుచేస్తున్నారు.

  • 21 Jul 2022 12:32 PM (IST)

    ఆదివాసీలకే కాదు.. దేశపౌరులకే గర్వకారణం: కిరణ్‌ రిజిజు

    ఆదివాసీలే కాదు, గిరిజన అధ్యక్షుడిని కలిగి ఉండటం దేశం మొత్తానికి గర్వకారణం అన్నారు కేంద్రమంత్రి కిరణ్ రిజిజు. రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు నేపథ్యంలో కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు ఇలా స్పందించారు. దివాసీలకే కాదు, దేశంలోని ప్రతి ఒక్కరికీ ప్రథమ పౌరురాలిగా గిరిజన మహిళ కావడం గర్వకారణం. రాష్ట్రపతి అవుతున్న ద్రౌపదీ ముర్ముని పలకరించడానికి ఢిల్లీకి వస్తానన్నారు.

  • 21 Jul 2022 11:56 AM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు

     

  • 21 Jul 2022 11:40 AM (IST)

    రాయ్‌రంగ్‌పూర్‌ లో సంబరాలు

    రాష్ట్రపతి ఎన్నికలో ద్రౌపదీ ముర్ము విజయం దాదాపు ఖాయం. దీంతో ఆమె స్వస్థలంలో భారీ సంబరాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. మయూర్‌భంజ్‌లోని రాయ్‌రంగ్‌పూర్‌ పట్టణంలో ఇప్పటికే పెద్ద పెద్ద హోర్డింగ్‌లు వెలిశాయి. జానపద కళాకారులు, గిరిజన నృత్యకారులు ద్రౌపదీ ముర్ము విజయం సాధిస్తారని, తమకు ఇది అపూర్వమని అంటున్నారు. వారు సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితం అధికారికంగా ప్రకటించగానే ఈ సంబరాలు ఆకాశాన్నంటుతాయని స్థానిక నేతలు చెబుతున్నారు. బైక్‌ ర్యాలీలు, మిఠాయిల పంపిణీకి రంగం సిద్ధం అయింది.

  • 21 Jul 2022 11:38 AM (IST)

    ఓట్ల లెక్కింపు ఎలా అంటే..

    రాష్ట్రపతి ఎన్నికకు ప్రధాన రిటర్నింగ్‌ అధికారిగా ఉన్న రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పి.సి.మోదీ ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఎంపీలు, ఎమ్మెల్యేల బ్యాలెట్‌ పేపర్లను వేరు చేస్తున్నారు. తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ వెంటనే పి.సి.మోదీ ఫలితం సరళిని మీడియాకు తెలియజేస్తారు. ఆపై ఆంగ్ల అక్షరమాల ప్రకారం ఒక్కో రాష్ట్రానికి చెందిన ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. 10 రాష్ట్రాలకు సంబంధించిన బ్యాలెట్‌ పేపర్ల లెక్కింపు పూర్తయ్యాక ఒకసారి, 20 రాష్ట్రాల కౌంటింగ్‌ ముగిశాక మరోసారి ప్రధాన రిటర్నింగ్‌ అధికారి ఫలితం సరళిని వెల్లడిస్తారు.

  • 21 Jul 2022 11:16 AM (IST)

    రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు షురూ..

    భారత అత్యున్నత పీఠాన్ని అధిరోహించే తదుపరి నేత ఎవరో మరికొద్దిగంటల్లో తేలనుంది. రాష్ట్రపతి ఎన్నిక ఓట్ల లెక్కింపు మొదలైంది. పార్లమెంట్ భవనంలో ఉదయం 11 గంటలకు ప్రక్రియ ప్రారంభమవ్వగా.. సాయంత్రం 3 నుంచి 4 గంటలకల్లా ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. అధికార ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము, విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా రాష్ట్రపతి పీఠం కోసం ముఖాముఖి తలపడ్డారు. ముర్ముకు తగినంత మెజార్టీ ఉండటంతో ఆమె విజయం లాంఛనమేనని విశ్లేషకులు చెబుతున్నారు.

     

  • 21 Jul 2022 09:53 AM (IST)

    ఏపీలో ఓటేసింది ఎంతమంది అంటే?

    రాష్ట్రపతి ఎన్నికల్లో భాగంగా ఏపీలో 172 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైసీపీ తరపున 151 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్‌కు హాజరయ్యారు. ఎంపీలందరూ పార్లమెంట్ భవనం ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. టీడీపీ నుంచి హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఓటు వేయలేదు. బాలకృష్ణ సినిమా షూటింగ్ నిమిత్తం విదేశాల్లో ఉండగా.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి వ్యక్తిగత పర్యటన కోసం అమెరికా వెళ్లారు. దీంతో టీడీపీ తరపున రెండు ఓట్లు తక్కువగా పడ్డాయి. ఏపీకి చెందిన వైసీపీ ఎమ్మెల్యే మహిధర్ రెడ్డి తెలంగాణలో ఓటేశారు.

  • 21 Jul 2022 09:50 AM (IST)

    పార్లమెంటులో ఓటేసిన తెలంగాణ ఎంపీలు

    రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్‌రావు నేతృత్వంలో టీఆర్‌ఎస్‌ రాజ్యసభ, లోక్‌సభ సభ్యులు సోమవారం పార్లమెంట్‌ ప్రాంగణంలోని 63వ రూంలో ఏర్పాటు చేసిన పోలింగ్‌బూత్‌లో తమ ఓటు వేశారు. రాజ్యసభ సభ్యులు కే. కేశవరావు, కేఆర్‌ సురేష్‌రెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్‌, దీవకొండ దామోదర్‌రావు, బడుగుల లింగయ్యయాదవ్‌, బండి పార్థసారథిరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, లోక్‌సభ సభ్యులు నామా నాగేశ్వర్‌రావు, పోతుగంటి రాములు, గడ్డం రంజింత్‌రెడ్డి, కొత్త ప్రభాకర్‌రెడ్డి, పసునూరి దయాకర్‌, వెంకటేశ్‌నేత, మాలోత్‌ కవిత, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, బీబీ పాటిల్‌ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

  • 21 Jul 2022 09:48 AM (IST)

    తెలంగాణలో ఓటేసింది ఎంతమంది?

    తెలంగాణలో 119 ఎమ్మెల్యేలు, ఏపీలోని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్‌రెడ్డి మొత్తం 120 మంది సభ్యులకు గాను 118 (98.33శాతం) మంది ఓటేశారు. మంత్రి గంగుల కమలాకర్‌ అనారోగ్య కారణాలతో, ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌ విదేశీ పర్యటనలో ఉండటం వల్ల తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. రాష్ట్రం నుంచి 117 మంది సభ్యులు, ఏపీ నుంచి ఒకరు ఇలా మొత్తం 118 మంది ఓటింగ్‌లో పాల్గొన్నారు.

  • 21 Jul 2022 09:21 AM (IST)

    భారత రాష్ట్రపతులు వీరే!

    Presidents of India List : భారత గత రాష్ట్రపతులు వీరే..

    డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ 1950 - 1962

    డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ 1962 - 1967

    డాక్టర్ జాకీర్ హుస్సేన్ 1967 - 1969

    వరాహగిరి వెంకటగిరి మే, జులై - 1969 (ఆపద్ధర్మ)

    జస్టీస్ మహ్మద్ హిదయతుల్లా జులై,ఆగస్ట్ - 1969 ఆపద్ధర్మ)

    వరాహగిరి వెంకటగిరి 1969 - 1974

    ఫక్రుద్ధీన్ ఆలి అహ్మద్ 1974 - 1977

    బి.డి. జెట్టీ ఫిబ్రవరి-జులై - 1977(ఆపద్ధర్మ)

    నీలం సంజీవరెడ్డి 1977 - 1982

    జ్ఞాని జైల్ సింగ్ 1982 - 1987

    ఆర్.వెంకట్రామన్ 1987 - 1992

    డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ 1992 - 1997

    కె.ఆర్.నారాయణన్ 1997 - 2002

    ఎ.పి.జె. అబ్దుల్ కలాం 2002 - 2007

    ప్రతిభా పాటిల్ జులై 25, 2007 - 2012

    ప్రణబ్ కుమార్ ముఖర్జీ జూలై 25, 2012 - 2017

    రామ్ నాథ్ కోవింద్ జూలై 25, 2017 నుంచి..

  • 21 Jul 2022 09:10 AM (IST)

    ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ల మధ్య పోటీ

    నేడు భారత రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ద్రౌపది ముర్ము, యశ్వంత్ సిన్హా ల మధ్య పోటీ. పార్లమెంట్ భవనం లో ఓట్ల లెక్కింపు కు ఏర్పాట్లు. ప్రాధాన్యతా క్రమంలో బ్యాలట్ పేపర్లపై ఆకుపచ్చ రంగు ఇంకు పెన్నులతో రాసిన ఎంపీలు, గులాబీ రంగు ఇంకు పెన్నులతో రాసిన ఎమ్మెల్యేలు. బ్యాలట్ పత్రాలను వేరు చేసిన తర్వాత, ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ద్రౌపది ముర్ము కు ఒక ట్రే, యశ్వంత్ సిన్హా కు మరొక ట్రే ఏర్పాట్లు చేశారు. ముందుగా ఎమ్.ఎల్.ఏల బ్యాలట్ పేపర్లను, ఆతర్వాత ఎమ్.పిల బ్యాలట్ పేపర్లు ను వేరుచేస్తారు.

     

    ప్రాధాన్యత క్రమంలో ద్రౌపది ముర్ము పేరును ముందుగా రాసిన బ్యాలట్ పత్రాలను ఆమె ట్రే లోనూ, సిన్హా కు మొదటి ప్రాధాన్యత ఇస్తూ రాసిన బ్యాలట్ పత్రాలను ఆయన ట్రే లోనూ ఉంచడం జరుగుతుంది. ఎమ్.పి ఓటు విలువ ను 700 గా నిర్ధారణ. ఎమ్.ఎల్.ఏ ఓటు విలువ ఆయా రాష్ట్రాల జనాభా ను బట్టి నిర్ధారించారు. బ్యాలట్ పత్రాలను వేరు చేసిన తర్వాత, ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. పార్లమెంట్ భవనం లో రూమ్ నెంబర్ 73 వద్ద మీడియా కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. లెక్కింపు ప్రారంభం కాగానే, ఎప్పటికప్పుడు ఫలితాల సరళి ని మీడియా కు తెలియజేసేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్ది గెలుపును నిర్ధారించేది ఎక్కువ ఓట్లు కాదు ఓట్ల విలువ. సాయంత్రం 4 గంటలకు ఫలితం అధికారికంగా ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది.