NTV Telugu Site icon

President Security: రాష్ట్రపతి పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు

President Droupadi Murmu

President Droupadi Murmu

President Security Breach in Rajasthan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన ఓ ప్రభుత్వ అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఇంజినీర్ రాష్ట్రపతి ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము భద్రతను ఉల్లంఘించిన వారం తర్వాత, ఆమె పాదాలను తాకేందుకు ప్రయత్నించిన పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఒక జూనియర్ ఇంజనీర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.

రాష్ట్రపతి జనవరి 3, 4 తేదీల్లో రాజస్థాన్‌లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్‌లోని స్కౌట్‌ గైడ్‌ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్‌.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతికి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచిచూస్తున్నారు. రాష్ట్రపతి చేరుకోగానే.. ప్రొటోకాల్‌ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిని రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.

Kaali Movie Poster Row: ‘కాళీ’ సినిమా పోస్టర్‌ వివాదం.. సుప్రీంను ఆశ్రయించిన ఫిల్మ్‌మేకర్

అయితే, రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదికను కోరింది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన రాజస్థాన్‌ ప్రభుత్వం.. రాజస్థాన్‌ సివిల్‌ సర్వీసెస్‌ నియమాల ప్రకారం, సదరు ఇంజినీర్‌ను తక్షణమే సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్‌లోని రూల్ నంబర్ 958 ప్రకారం అధికారిని అంబా సియోల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.