President Security: రాష్ట్రపతి పాదాలు తాకేందుకు ప్రయత్నించిన అధికారినిపై సస్పెన్షన్ వేటు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
President Security Breach in Rajasthan: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ప్రొటోకాల్‌ను ఉల్లంఘించిన ఓ ప్రభుత్వ అధికారినిపై సస్పెన్షన్ వేటు పడింది. రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళా ఇంజినీర్ రాష్ట్రపతి ముర్ము పాదాలను తాకేందుకు ప్రయత్నించడాన్ని రాజస్థాన్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణించి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాజస్థాన్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము భద్రతను ఉల్లంఘించిన వారం తర్వాత, ఆమె పాదాలను తాకేందుకు ప్రయత్నించిన పబ్లిక్ హెల్త్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఒక జూనియర్ ఇంజనీర్‌ను రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
రాష్ట్రపతి జనవరి 3, 4 తేదీల్లో రాజస్థాన్‌లో పర్యటించారు. అందులో భాగంగా రోహెత్‌లోని స్కౌట్ గైడ్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సమయంలో ప్రజారోగ్య విభాగంలో ఇంజినీర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తోన్న అంబా సియోల్.. సభా ప్రాంగణంలో నీళ్లను అందించే బాధ్యతలు చూస్తున్నారు. రాష్ట్రపతికి ఆ ప్రాంగణానికి చేరుకున్న సమయంలో స్వాగతం పలికేందుకు అధికారులు వేచిచూస్తున్నారు. రాష్ట్రపతి చేరుకోగానే.. ప్రొటోకాల్ ఉల్లంఘించి అడుగు ముందుకేసిన ఆ అధికారిని రాష్ట్రపతి పాదాలకు నమస్కరించేందుకు ప్రయత్నించారు.
Also Read
- Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
- Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
- Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
- Cyclone Arnab: ‘సైక్లోన్ అర్నబ్’ పేరుతో వైరల్.. ఐఎండీ ఏం చెప్పిందంటే..!
Kaali Movie Poster Row: ‘కాళీ’ సినిమా పోస్టర్ వివాదం.. సుప్రీంను ఆశ్రయించిన ఫిల్మ్‌మేకర్
అయితే, రాష్ట్రపతి వ్యక్తిగత సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన కేంద్ర హోంశాఖ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి నివేదికను కోరింది. స్థానిక పోలీసులు కూడా దర్యాప్తు చేపట్టారు. ఈ వ్యవహారంపై చర్యలు చేపట్టిన రాజస్థాన్ ప్రభుత్వం.. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్ నియమాల ప్రకారం, సదరు ఇంజినీర్‌ను తక్షణమే సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది. రాజస్థాన్ సివిల్ సర్వీసెస్‌లోని రూల్ నంబర్ 958 ప్రకారం అధికారిని అంబా సియోల్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!