President Droupadi Murmu: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఎడమ కంటికి శస్త్రచికిత్స జరిగింది. ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో కంటిశుక్లం ఆపరేషన్ చేయించుకున్నారు రాష్ట్రపతి ముర్ము. ఆస్పత్రిలో ఎస్కే మిశ్రా వైద్య బృందం ముర్ముకు ఆదివారం ఉదయం 11.30 గంటలకు ఆపరేషన్ చేసినట్లు రాష్ట్రపతి భవన్ ప్రతినిధి అధికారికంగా వెల్లడించారు. సర్జరీ విజయవంతం కావడంతో ఆమెను వైద్యులు డిశ్చార్జ్ చేశారు. రాష్ట్రపతికి కొద్ది రోజుల పాటు విశ్రాంతి అవసరం అని వైద్యులు సూచించారు.
MK Stalin: హిందీని బలవంతంగా రుద్దొద్దు.. ప్రధాని మోడీకి తమిళనాడు సీఎం స్టాలిన్ లేఖ
రాష్ట్రపతి భవన్ ప్రకారం, ‘శస్త్రచికిత్స విజయవంతమైంది, ఆమె ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయబడింది.’ ద్రౌపది ముర్ము భారత్‌కు 15వ రాష్ట్రపతిగా జులైన 25,2022న బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రపతి ముర్ము అసోంలో రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది. ఈ సందర్భంగా ముర్ము గౌహతిలోని శక్తిపీఠ్ కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు.
