Indian UPI In Maldives: మాల్దీవుల ప్రెసిడెంట్ మహమ్మద్ ముయిజ్జూ క్యాబినెట్ సిఫార్సుపై భారతదేశం యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)ని ప్రారంభించాలని నిర్ణయించారు. మాల్దీవుల్లో UPIని ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని మహమ్మద్ ముయిజ్జు ఆదివారం కోరారు. ముయిజు నిర్ణయం గురించి సమాచారం ఇస్తూ.. మాల్దీవుల అధ్యక్ష కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో, ఈ నిర్ణయం దేశ ఆర్థిక వ్యవస్థను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు. దీని వల్ల ఆర్థిక చేరిక, ఆర్థిక లావాదేవీల్లో సామర్థ్యం ఇంకా డిజిటల్ మౌలిక సదుపాయాల అభివృద్ధి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
Read Also: Haryana Cabinet portfolios: మంత్రుల పోర్ట్‌ఫోలియో కేటాయింపు.. ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయించారంటే
మాల్దీవులలో UPIని ప్రారంభించేందుకు ఒక ఏజెన్సీని ఏర్పాటు చేయాలని అధ్యక్షుడు ముయిజు ప్రకటించారు. మాల్దీవుల బ్యాంకులు, టెలికమ్యూనికేషన్ కంపెనీలు, ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలు ఇంకా ఫిన్‌టెక్ కంపెనీలను కూడా ఈ కన్సార్టియంలో చేర్చాలని ఆయన సూచించారు. మొహమ్మద్ ముయిజ్జు ట్రేడెనెట్ మాల్దీవులను కన్సార్టియంను ప్రధాన ఏజెన్సీగా నియమించారు. ఈ ఏడాది ఆగస్టులో భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాల్దీవుల పర్యటన సందర్భంగా యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకాలు చేశారు. మాల్దీవుల్లో డిజిటల్ చెల్లింపు వ్యవస్థను ప్రారంభించేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎకనామిక్ డెవలప్‌మెంట్ ట్రేడ్ ఆఫ్ మాల్దీవుల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.
Read Also: Jammu Kashmir: భారీగా ఆయుధాలు కలిగి ఉన్న ఉగ్రవాదిని హతమార్చిన ఇండియన్ ఆర్మీ
ఈ ఒప్పందం ప్రకారం, మాల్దీవుల ప్రజలు కూడా భారతదేశంలో వలె UPI ద్వారా చెల్లింపులు చేయగలరు. మాల్దీవులలో భారతదేశం సంబంధించిన UPIని ప్రవేశపెట్టాలనే నిర్ణయాన్ని మహమ్మద్ ముయిజ్జూ ప్రకటించకముందే.. ఆ దేశ జాతీయ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ మాల్దీవ్స్ (BML) కూడా భారతదేశానికి సంబంధించి ఒక ముఖ్యమైన ప్రకటన చేసింది. భారతదేశంలోని రూపే కార్డ్ ఇప్పుడు దాని ATMలు, POS మెషీన్లలో అంగీకరించబడుతుందని BML ఈ నెల అక్టోబర్ 7న ప్రకటించింది.