NTV Telugu Site icon

Criminal Bills: రాష్ట్రపతి ఆమోదంతో మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు చట్టబద్ధత

President

President

Criminal Bills: కేంద్ర సర్కారు తీసుకొచ్చిన మూడు కొత్త క్రిమినల్‌ బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ల స్థానంలో కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధీనం బిల్లులను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ మూడు కొత్త బిల్లులకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఉభయసభలు ఆమోదం తెలపడంతో రాష్ట్రపతి పరిశీలన కోసం కేంద్రం పంపించింది. తాజాగా నేడు ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలపడంతో ఆ బిల్లులు చట్టబద్ధతను పొందాయి.

Read Also: NDA vs INDIA: 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎవరిది పైచేయి?.. సీ-ఓటర్‌ సర్వేలో అనూహ్య ఫలితాలు

రాష్ట్రపతి ఆమోదం తెలుపుతూ గెజిట్ విడుదల కావడంతో ఈ మూడు బిల్లులు ఇక చట్టాలుగా మారనున్నాయి. కాగా, ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌‌లలో కొన్ని సవరణలతో పాటు.. మరికొన్ని అంశాలను చేరుస్తూ.. ఆ మూడు చట్టాల పేర్లను మారుస్తూ కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త బిల్లులను తీసుకువచ్చింది. ఈ మూడు బిల్లులకు రాష్ట్రపతి ఆమోదంతో చట్టబద్దత కలిగింది. ఇకపై ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, సీఆర్‌పీసీ స్థానంలో భారతీయ నాగరిక సురక్ష సంహిత, ఎవిడెన్స్ యాక్ట్‌ స్థానంలో భారతీయ సాక్ష్య అధీనం పేర్లు కనబడనున్నాయి. బ్రిటిష్ కాలం నాటి ఐపీసీ, సీఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్ట్‌ పేర్లు ఇక నుంచి కనిపించవు.