NTV Telugu Site icon

President Droupadi Murmu: శీతాకాల విడిదికి రాష్ట్రానికి విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

President

President

President Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. శీతాకాల విడిది కోసం విచ్చేసిన రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్‌ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఘన స్వాగతం పలికారు. నేటి నుంచి ఈ నెల 21వ తేదీ వరకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇక్కడే ఉండనున్నారు. రాష్ట్రపతి నిలయంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. పలువురు ప్రముఖులు రాష్ట్రపతిని కలిసే అవకాశం ఉంది. ఈ నెల20న సికింద్రాబాద్‌లోని డిఫెన్స్ మేనేజ్‌మెంట్‌ కాలేజీని రాష్ట్రపతి సందర్శించనున్నారు. డిఫెన్స్ మేనేజ్‌మెంట్ కళాశాలకు రాష్ట్రపతి స్కాలర్స్‌ అవార్డును రాష్ట్రపతి ప్రధానం చేయనున్నారు.

Read Also: TG Assembly: విపక్షాల నిరసనల మధ్యే మూడు కీలక బిల్లులకు ఆమోదం

ఈ నెల 20వ తేదీన(శుక్రవారం) రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి బృందం, అధికారులు, పౌరులతో ‘ఎట్‌ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ నెల 21న ఉదయం 10 గంటలకు చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీని రాష్ట్రపతి సందర్శిస్తారు. కోటి మహిళా కాలేజీ శతాబ్ది ఉత్సవాల వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొంటారు. కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ఢిల్లీ వెళ్తారు. రాష్ట్రపతి రాకతో నేటి నుంచి ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు కానున్నాయి.

 

Show comments