NTV Telugu Site icon

Droupadi Murmu: నేడు హైదరాబాద్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము..

Murmu

Murmu

Global Spirituality Mahotsav: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ హైదరాబాద్ రానున్నారు. నగరంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని ఆమె ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి తన సందేశాన్ని వినిపిస్తారు. అలాగే, రేపు (శనివారం) ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ డ్ విశిష్ట అతిధిగా హాజరు కాబోతున్నారు. ఈ నెల 17న ప్రపంచ ఆధ్యాత్మిక గురువుల కొన్ని సెషన్లు ఉండనున్నాయి. ఇక, ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనం-2024 నిన్న (గురువారం) స్టార్ట్ అయింది. దీన్ని కేంద్ర పర్యాటక మంత్రిత్వశాఖ, హార్ట్ ఫుల్నెస్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో నాలుగు రోజుల పాటు కొనసాగనుంది.

Read Also: Samsung A35 5G: మార్కెట్ లోకి వచ్చేసిన శాంసంగ్ కొత్త మొబైల్.. ఫీచర్స్, ధర ఎంతంటే?

ఇక, ఈ సమ్మేళనానికి భారత్ సహా వందకుపైగా దేశాల నుంచి దాదాపు 300 మంది ప్రఖ్యాత సర్వమత గురువులు తరలి వచ్చారు. తొలి రోజు ప్రఖ్యాత శంకర్ మహాదేవన్, కుమరేష్ రాజగోపాలన్, శశాంక్ సుబ్రమణ్యం నేతృత్వంలో సంగీత కచేరితో ఆరంభమైంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కన్హా శాంతి వనం వేదికగా ఈ సమ్మేళనం కొనసాగుతుంది. ఇక, రెండో రోజు ఇవాళ (శుక్రవారం) ప్రపంచ ఆధ్యాత్మిక సమ్మేళనాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.

Read Also: Samantha : జిమ్ లో తెగ కష్టపడుతున్న సామ్..వీడియో వైరల్…

ఇక, హైదరాబాద్‌ శివారు కన్హా శాంతివనంలో నిర్వహించే ‘ప్రపంచ ఆధ్యాత్మిక మహోత్సవ్‌ కార్యక్రమంలో పాల్గొనేందుకు ద్రౌపది ముర్ము వస్తుండటంతో పాటు రాష్ట్ర రాజధానిలో ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం రేవంత్ రెడ్డి కార్యక్రమాలు కూడా నగరంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని మూడు కమిషనరేట్ల పోలీసులు విస్తృత స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే, రంజాన్‌ మాసంలో సున్నిత పరిస్థితుల దృష్ట్యా అసాంఘిక చర్యలకు ఛాన్స్ లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.