Site icon NTV Telugu

Droupadi Murmu: పుట్టపర్తిలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

Droupadi Murmu

Droupadi Murmu

Droupadi Murmu: భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తిలో పర్యటించారు. పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, రాష్ట్ర మంత్రి ఉషాశ్రీచరణ్, ట్రస్ట్‌ సభ్యులు రత్నాకర్‌ స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రశాంతి నిలయానికి చేరుకుని సత్యసాయి మహాసమాధిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు.

Also Read: CM KCR: కాంగ్రెస్ అంటే దళారీ, పైరవీకారుల రాజ్యం

ఆ తర్వాత పుట్టపర్తిలో సాయిహీరా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు రాష్ట్రపతి చేరుకున్నారు. సత్యసాయి డీమ్డ్ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా పాల్గొని 14 మందికి డాక్టరేట్లు, 21 మందికి విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. ఈ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. అనంతరం రోడ్డు మార్గాన సత్యసాయి విమానాశ్రయానికి బయలుదేరారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ బయలుదేరారు.

Exit mobile version