NTV Telugu Site icon

President Murmu: నేడు తెలంగాణలో రాష్ట్రపతి పర్యటన.. హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

Murmu

Murmu

Traffic restrictions: నేడు తెలంగాణ పర్యటనకు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వస్తున్నారు. శీతాకాల విడిదికి బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి ఆమె రాబోతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని పలు చోట్ల ఇవాళ పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని పేర్కొన్నారు. ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు రక్షణ శాఖ పరిధిలోని హకీంపేట వైమానిక దళ శిక్షణ కేంద్రానికి భారత రాష్ట్రపతి ముర్ము ప్రత్యేక విమానంలో చేరుకోనున్నారు. అక్కడి నుంచి నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి రాత్రి 7 గంటలకు చేరుకుంటారు. దీంతో ప్రెసిడెంట్ రాకతో ఆయా మార్గాల్లో రాష్ట్రపతి కాన్వాయ్ కి సంబంధించి అధికారులు శనివారం రిహార్సల్ సైతం నిర్వహించారు. సైబరాబాద్ సీపీ ఏకే మహంతి రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Read Also: Accident : బుందేల్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఇక, రహదారికి ఇరు వైపులా ఉన్న నివాసాలపై ఇప్పటికే పోలీస్, ఇంటెలిజెన్స్ సిబ్బంది ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి శీతకాల విడిదికాలంలో లోతుకుంట నుంచి ఆంక్షలు అమలు చేయబోతున్నారు. ఇవాళ సాయంత్రం హకీంపేట విమానాశ్రయం నుంచి వై జంక్షన్, బొల్లారం జంక్షన్, నేవీ జంక్షన్, యాప్రాల్ రోడ్డు, బైసన్ రోడ్డు, లోతుకుంట జంక్షన్ వైపు వచ్చే వెహికిల్స్ ను మళ్లించనున్నట్టు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. వాహనదారులు ప్రత్యామ్నామ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీస్ కమిషన్ సూచించారు.