Site icon NTV Telugu

President Hyderabad Tour: బొల్లారంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది.. ఎప్పుడంటే?

Droupadi Murmu

Droupadi Murmu

భారత రాష్ట్రపతి ప్రతి ఏటా డిసెంబర్ మాసంలో హైదరాబాద్ లో బస చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ ఏడాది భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో శీతాకాలం విడిది షెడ్యూల్ విడుదలైంది.

* డిసెంబర్‌ 26న 12.15 నుండి 12.45 వరకు శ్రీశైలం పర్యటన ఉంటుంది.

* మధ్యాహ్నం 3.05 – 3.15 సికింద్రాబాద్ బొల్లారంలోని యుద్ధ స్మారకం వద్ద పుష్పాంజలి. వీరనారిలకు సత్కారం చేస్తారు.

* డిసెంబర్ 27న ఉదయం 10.30 – 11.30 నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం

* మధ్యాహ్నం 3.00- 4.00 సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో అఖిల భారత పోలీస్ సేవల 74వ బ్యాచ్ ట్రైనీ అధికారులతోపాటు భూటాన్, నేపాల్, మారిషస్ మాల్దీవుల దేశాల అధికారులతో సమావేశం

* డిసెంబర్‌ 28న ఉదయం 10.40 – 11.10 భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి ఆలయ సందర్శన. ప్రసాద్ పథకం ప్రారంభం. అనంతరం మిశ్ర ధాతు నిగం లిమిటెడ్(మిథాని)కి సంబంధించిన వైడ్ ప్లేట్ మిల్ ప్లాంట్ ను వర్చువల్ లు ప్రారంభిస్తారు.

* అదేరోజు మధ్యాహ్నం 3.00-3.30 వరంగల్‌లోని రామప్ప ఆలయ సందర్శిస్తారు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ప్రసాద్ ప్రాజెక్టు ప్రారంభం… ప్రాజెక్ట్ లకు శంకుస్థాపన వుంటుంది.

* డిసెంబర్‌ 29న ఉదయం 11.00-12.00 షేక్‌పేటలోని జి.నారాయణమ్మ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మహిళా కళాశాల సందర్శన. విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం.

* సాయంత్రం 5.00-6.00 శంషాబాద్‌లోని శ్రీరామ్‌నగర్‌లో సమైక్యతామూర్తి (శ్రీ రామానుజాచార్య) విగ్రహ సందర్శన చేస్తారు.

* డిసెంబర్ 30న ఉదయం 10.00-11.00 రంగారెడ్డి జిల్లాలోని కన్హా శాంతి వనంలో శ్రీ రామచంద్ర మిషన్ లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన అంగన్వాడీ, ఆశా వర్కర్లను ఉద్దేశించి ప్రసంగం చేస్తారు.

అనంతరం సాంస్కృతిక మంత్రిత్వశాఖ, శ్రీ రామ చంద్ర మిషన్ కలిసి చేపడుతున్న ‘హర్ దిల్ ధ్యాన్, హర్ దిన్ ధ్యాన్’ ప్రచార కార్యక్రమం ప్రారంభం అవుతుంది. మధ్యాహ్నం 1.00గంటకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విందు ఇవ్వనున్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు అధికారులు.

Read Also:Jr NTR: ఎన్టీఆర్ గ్లోబల్ స్టార్ అవుతాడు అంటే ఎవరూ నమ్మలేదు…

Exit mobile version