NTV Telugu Site icon

Delhi: బంగ్లాదేశ్ సింగర్ రెజ్వానాకు పద్మశ్రీ అందించిన రాష్ట్రపతి

Pae

Pae

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో పద్మశ్రీ పురస్కరాల కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. అవార్డు గ్రహీతులకు పురస్కరాలు అందజేశారు. కళారంగంలో బంగ్లాదేశ్ గాయని శ్రీమతి రెజ్వానా చౌదరి బన్యాకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పద్మశ్రీని ప్రదానం చేశారు. భజన-గాయకుడు శ్రీ కాలూరామ్ బమానియాకు పద్మశ్రీని అందజేశారు. ఇక వైద్యరంగంలో తేజస్ మధుసూదన్ పటేల్‌కు పద్మభూషణ్‌, వాణిజ్యం, పరిశ్రమల రంగంలో సీతారాం జిందాల్‌కు పద్మభూషణ్‌ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు.

ఇది కూడా చదవండి: Congress: సూరత్ అభ్యర్థి మిస్సింగ్.. ఈసీకి కాంగ్రెస్ ఏం ఫిర్యాదు చేసిందంటే..!

ఇక ఈ కార్యక్రమంలో పద్మవిభూషణ్ పురస్కారాన్ని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 25న ఈ జాబితాను ప్రకటించింది. ఈ ప్రకటనలో భాగంగా ఐదుగురికి పద్మ విభూషణ్ లు, 17 మందికి పద్మభూషణ్ లు, 110 మందికి పద్మశ్రీ అవార్డులను ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తెలుగు సినీ నటుడు కొణిదెల చిరంజీవికి కూడా పద్మవిభూషణ్ అవార్డుకు ఎన్నికయ్యారు.

ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ ముఖ్య నాయకులు హాజరయ్యారు. పురస్కరాల గ్రహీలను చప్పట్లతో ప్రధాని మోడీ అభినందించారు.