NTV Telugu Site icon

Trump Rally Firing: డొనాల్డ్ ట్రంప్‌తో మాట్లాడిన అధ్యక్షుడు బైడెన్..ఏమన్నారంటే..?

Trumpbiden

Trumpbiden

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే. దీన్నుంచి ఆయన తృటిలో తప్పించుకున్నారు. ట్రంప్ కుడి చెవిపై నుంచి తూటా వెళ్లింది. వెంటనే అప్రమత్తమైన ట్రంప్ కిందికి వంగి ప్రాణాలు కాపాడుకున్నారు. అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అగంతకుడిని మట్టుబెట్టింది. ఈ ఘటన జరిగిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడారు. ఈ ఘటనపై వైట్ హౌస్ అధికారులు సమాచారం ఇస్తూ.. అధ్యక్షుడు బిడెన్ మాజీ అధ్యక్షుడు ట్రంప్‌తో మాట్లాడినట్లు తెలిపారు. పెన్సిల్వేనియా గవర్నర్ జోష్ షాపిరో మరియు బట్లర్ మేయర్ బాబ్ దండోయ్‌లతో కూడా బైడెన్ మాట్లాడినట్లు వెల్లడించారు.

READ MORE: Home Minister Anitha: యువకుడి దాడిలో గాయపడిన కానిస్టేబుల్‌ని పరామర్శించిన హోం మంత్రి

బిడెన్ ఈ వారం డెలావేర్‌లోని తన ఇంటిలో ఉన్నారు. అర్ధరాత్రి వైట్ హౌస్‌కి తిరిగి వచ్చారు. నిన్న ఉదయం వైట్ హౌస్‌లో హోంల్యాండ్ సెక్యూరిటీ మరియు లా ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల నుంచి ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని అందుకున్నట్లు వైట్ హౌస్ అధికారులు తెలిపారు. షూటింగ్‌పై స్పందించిన సీక్రెట్ సర్వీస్.. భద్రతా సిబ్బందికి బైడెన్ కృతజ్ఞతలు చెప్పారు. కాల్పులు జరిగినప్పుడు అధ్యక్షుడు డెలావేర్ చర్చిలో ఉన్నారన్నారు. సీక్రెట్ సర్వీస్ హెడ్ కింబర్లీ చీటిల్, హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ అలెజాండ్రో మయోర్కాస్ మరియు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్ లిజ్ షేర్‌వుడ్-రాండాల్ అతనికి సమాచారం అందించారు.