NTV Telugu Site icon

PREMINCHODDU: ప్రతి విద్యార్థి తప్పనిసరి చూడాల్సిన చిత్రం ‘ప్రేమించొద్దు’.. ట్రైలర్ విడుదల..

Preminchoddu3

Preminchoddu3

శిరిన్ శ్రీరామ్ దర్శక నిర్మాణంలో.. శిరిన్ శ్రీరామ్ కేఫ్ బ్యానర్‌పై అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రేమించొద్దు’. ఓ బ‌స్తీ నేపథ్యంలో సాగే యూత్‌ ఫుల్ ప్రేమ కథ చిత్రం. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ సినిమాను ఏకంగా పాన్ ఇండియా చిత్రంగా రూపొందించారు. సినిమాను ఏకంగా 5 భాషల్లో విడుదల చేయనున్నారు. జూన్ 7న ఈ చిత్రం తెలుగు వెర్షన్‌‌ ని విడుదల చేస్తున్నారు. ఆపై మిగితా త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో రిలీజ్ చేయ‌టానికి కూడా ప్లాన్ చేస్తుంది మూవీ మేకర్స్.

T. Harish Rao: మంత్రికి మతిభ్రమించింది.. కోమట్ రెడ్డి వెంటకట్ రెడ్డిపై హరీష్ రావు ఫైర్

ఈ నేపథ్యంలో ఆదివారం నాడు మూవీ ట్రైలర్‌ను లాంచ్ చేసింది చిత్ర బృందం. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పోస్టర్, సాంగ్స్‌ తో సినిమా మీద మంచి బజ్ ను ఏర్పరిచారు. తెలిసీ తెలియని వయసులో, ముక్యంగా చదువుకోవాల్సిన సమయంలో ప్రేమించొద్దు అనే కాన్సెప్ట్‌తో రియల్ ఇన్సిడెంట్‌ల ఆధారంగా ఈ సినిమాను రా అండ్ రస్టిక్‌ గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. తాజాగా రిలీజ్ చేసిన ట్రైలర్‌ ను చూస్తే పూర్తి కథను వివరించినట్టుగా అర్థమవుతుంది.

Indian 2: ఆయన నమ్మకమే ‘భారతీయుడు 2’.. కమల్ హాసన్ కీలక వ్యాఖ్యలు..

స్కూల్, కాలేజ్ ఏజ్ లవ్ స్టోరీలు, ప్రేమ అంటూ చదువుల్ని నిర్లక్ష్యం చేయడం, తెలిసీ తెలియని వయసులో ప్రేమిస్తే ఎదురయ్యే పరిణామాలను కళ్ళకు కట్టినట్లు ఇందులో చూపించారు. ఇక ట్రైలర్‌ లోని విజువల్స్, డైలాగ్స్ ఎంతో అద్బుతుంగా ఉన్నాయి. సమాజాన్ని మేల్కోలేపేలా ఈ చిత్రం ఉంటుందని ట్రైలర్ చూస్తే ఇట్టే అర్థం అవుతోంది. ఇక ఈ సినిమాలో అనురూప్ రెడ్డి, దేవా మలిశెట్టి, సారిక, మానస, యశ్వంత్ పెండ్యాల, సంతోషి తాళ్ల, సోనాలి గర్జె, లహరి జులురి, శ్రద్ధా సాయి, వల్లీ శ్రీగాయత్రి, లక్ష్మీకాంత్ దేవ్ తదితరులు నటించారు. ఇక సాంకేతిక వర్గం చూస్తే.. రచన, ఎడిటింగ్, నిర్మాత, దర్శత్వంను శిరిన్ శ్రీరామ్ చేసుకోగా, మ్యూజిక్ ప్రోగ్రామింగ్ ను జునైద్ కుమార్, బ్యాగ్రౌండ్ స్కోర్ ను కమ్రాన్, సాంగ్స్ కంపోజింగ్ ను చైతన్య స్రవంతి, సినిమాటోగ్రఫీ అండ్ కలర్ ను హర్ష కొడాలి, స్క్రీన్ ప్లే ను శిరిన్ శ్రీరామ్, రాహుల్ రాజ్ వనం, ఇంకా అసోసియేట్ డైరెక్టర్ గా సోనాలి గర్జె, పబ్లిసిటీ డిజైన్ గా అజయ్ (ఏజే ఆర్ట్స్), విఎఫ్ఎక్స్ ను వి.అంబికా విజయ్ అందించగా, సౌండ్ ను సింక్ సినిమా, చెన్నై వారు, సూపర్‌వైజింగ్ ప్రొడ్యూస‌ర్‌ గా నిఖిలేష్ తొగ‌రి, పిఆర్ఒ గా చంద్ర వట్టికూటి, మోహన్ తుమ్మలలు వ్యవహరించనున్నారు.

Show comments