ప్రియదర్శి హీరోగా నటించిన రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ ‘ప్రేమంటే’ ఓటీటీ విడుదల తేదీ కన్ఫర్మ్ అయ్యింది. నవంబర్‌లో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన నెట్‌ఫ్లిక్స్‌లో డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాని నెట్‌ఫ్లిక్స్ సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దర్శకుడు నవనీత్ శ్రీరామ్ తెరకెక్కించిన ఈ చిత్రంలో ఆనంది హీరోయిన్‌గా నటించింది. ముఖ్య పాత్రల్లో సుమ కనకాల, వెన్నెల కిశోర్, హైపర్ ఆది వంటి ప్రముఖులు ప్రేక్షకులను బాగా నవ్వించారు.
Also Read : MSVG : ఆమె ఒప్పుకోవడం నా లక్.. అనిల్ రావిపూడి షాకింగ్ కామెంట్స్
ఈ సినిమా కథ విషయానికి వస్తే, జీవితం ఎప్పుడూ థ్రిల్లింగ్‌గా ఉండాలనుకునే అమ్మాయి రమ్య (ఆనంది). మరోవైపు ఇంటి బాధ్యతలను మోస్తూ ఉండే యువకుడు మధుసూదన్ అలియాస్ మది (ప్రియదర్శి). అనుకోకుండా ఒక పెళ్లి లో పరిచయమైన వీళ్లిద్దరూ.. తర్వాత అభిప్రాయాలు కలవడంతో పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుంటారు. అయితే, పెళ్లయ్యాక రమ్య అనుకున్నట్లుగా జీవితం థ్రిల్లింగ్‌గా సాగిందా? ఇంటి బాధ్యతలను చక్కబెట్టడానికి మది ఎంచుకున్న దారి ఏంటి? దాని గురించి తెలిశాక రమ్య ఎలా స్పందించింది? వీరి వైవాహిక జీవితానికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? చివరికి వీళ్ళిద్దరి బంధం కొనసాగిందా లేదా? అనేదే ఈ సినిమా కథ. ఈ రొమాంటిక్ కామెడీని ఇంట్లో కూర్చుని చూడాలనుకునే ప్రేక్షకులు డిసెంబర్ 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో చూడవచ్చు.
