NTV Telugu Site icon

Premalu OTT: మ‌రింత ఆల‌స్యం కాబోతున్న ప్రేమ‌లు ఓటీటీ రిలీజ్‌…!

15

15

ఓ మలయాళం సినిమా తెలుగులో డబ్బింగ్ చేసుకుని రిలీజ్ అయ్యి కలెక్షన్ల వర్షం కూసున్న సమయంలో సినిమాకు సంబంధించిన ఓటిటి రిలీజ్ డేట్ అభిమానుల్లో ఆసక్తికరంగా మార్చింది. ప్రేమలు సినిమా మార్చి 29న డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అంటూ ఇదివరకు గట్టిగా ప్రచారం జరిగింది. కాకపోతే మలయాళం, తెలుగుతోపాటు మిగిలిన భాషల్లో కూడా ఈ సినిమాలో రిలీజ్ కానున్నట్లు వార్తలు వచ్చాయి.. అయితే సినిమా మాత్రం ఓటీటీలో రిలీజ్ కాకపోవడంతో ఆడియన్స్ కాస్త డిసప్పాయింట్మెంట్ అయ్యారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ ఎప్పుడు అంటూ డిస్నీ హాట్ స్టార్ ను అనేకమంది ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఓటీటీలో ఆలస్యం కావడానికి పలు కారణాలు లేకపోలేదు.

Also read: Samantha: సిటాడెల్ ప్రయాణాన్ని ప్రారంభించడం అంత సులభం కాదు…సమంత షాకింగ్ కామెంట్స్!

తాజాగా మార్చి 15న ప్రేమలు సినిమా తమిళ వర్షన్ థియేటర్స్ లలో రిలీజ్ కాగా, తెలుగులో మార్చి 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం తమిళ తెలుగు వర్షన్స్ లో థియేటర్లలో ఆడుతున్న సమయంలో ఓటిటికి రిలీజ్ చేయడం సబబు కాదని భావించిన నిర్మాతలు ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కావడం అడ్డుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా మలయాళంలో ఇంకా వసూలను రాబడుతూనే ఉండగా.. తమిళ, తెలుగు భాషలో కూడా స్థాయికి తగ్గట్టుగా వసూలను రాబడుతోంది. దాంతో సినిమాని నిర్మాతల రిక్వెస్ట్ తో మార్చి 29న సినిమాను ఓటిటిలో రిలీజ్ చేయకుండా మరో రెండు వారాలు ఆలస్యంగా రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు డిస్నీ హాట్ స్టార్ తెలియజేసింది.

Also read: Gujarat : బస్ కండక్టర్ తో ప్రేమ, పెళ్లి.. నిజం తెలుసుకుని సూసైడ్ కు సిద్ధమైన యువతి

దీంతో ఈ సినిమా ఓటీటీ లో ఏప్రిల్ రెండో వారంలో వచ్చే అవకాశం ఉంది. ఇక ఏప్రిల్ మొదటి వారంలో సినిమాకి సంబంధించి డేట్ అనౌన్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు వర్షన్ థియేటర్లలో ఏకంగా 15 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. టాలీవుడ్ లో రిలీజ్ అయిన మలయాళం డబ్బింగ్ సినిమాలలో హైయెస్ట్ కలెక్షన్లు రాబట్టిన సినిమాగా ప్రేమలు రికార్డు సృష్టించింది. ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తనయుడు కార్తికేయ రిలీజ్ చేశాడు. ఈ సినిమాతో కార్తికేయ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చినట్లు అయింది.

Show comments