Site icon NTV Telugu

IPL 2023: గిల్‌ క్లీన్‌ బౌల్డ్‌.. ప్రీతీ జింటా కిరాక్ రియాక్షన్‌

Preethi Gill

Preethi Gill

ఇండియన్ ప్రీమియర్ లీగ్ సీజన్ 16లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండో ఓటమి చవి చూసింది. ఈవెంట్ లో భాగంగా గురువారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యా్చ్ లో 6 వికెట్ల తేడాతో పంజాబ్ ఓటమి పాలైంది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ 4 వికెట్లు కోల్పోయి మరో బంతి మిగిలూండగానే టార్గెట్ ను ఛేదించింది. గుజరాత్ బ్యాటర్లలో శుబ్ మన్ గిల్ ( 67) అద్భుతమైన ఇన్సింగ్స్ ఆడాడు. కాగా గుజరా్ విజయానికి ఆఖరి 6 బంతుల్లో 7 పరుుగులు అవసరమవ్వగా… ధావన్ సామ్ కర్రన్ చేతికి బంతిని ఇచ్చాడు. తొలి బంతికి మిల్లర్ సింగిల్ తీసి గిల్ కు స్ట్రైక్ ఇచ్చాడు. అయితే సామ్ కర్రన్ వేసిన అద్భుతమైన బాల్ కి శుబ్ మన్ గిల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

Read Also : Modi – Sunak : బ్రిటన్ ప్రధాని సునక్‌కి మోదీ ఫోన్.. ఆ అంశాలపైనే చర్చ

దీంతో పంజాబ్ డగౌట్ మొత్తం సంబరాల్లో మునిగి తేలిపోయింది. ముఖ్యంగా స్టాండ్స్ నుంచి మ్యాచ్ ను వీక్షిస్తున్న పంజాబ్ కింగ్స్ సహ యాజమాని, బాలీవుడ్ నటి ప్రీతి జింటా అనందానికి అవధులు లేకుండా పోయాయి. శుబ్ మన్ గిల్ ఔటైన వెంటనే ప్రీతి జింటా.. బాలీవుడ్ నటులు అర్భాజ్ ఖాన్, సోనూ సూద్ లతో కలిసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. అయితే ఆమె ఆనందం ఎక్కువ సేవు నిలవలేకపోయింది. ఆ తర్వాత రెండు బంతుల తర్వాత తెవాటియా ఫోర్ కొట్టి పంజాబ్ కు ఓటమిని మిగిల్చాడు. కాగా ప్రీతి జింటా రియాక్షన్ కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.

Read Also : IPL 2023: ఏందీ పాండ్యా ఇది.. చెత్త బ్యాటింగ్ తో అట్టర్ ప్లాప్

Exit mobile version