NTV Telugu Site icon

Preity Zinta: నా కెరీర్‌లో కఠినమైన సినిమా ఇదే: ప్రీతీ జింటా

Preity Zinta

Preity Zinta

Preity Zinta on Lahore 1947 Movie: ఆరేళ్ల విరామం తర్వాత బాలీవుడ్‌ నటి ప్రీతీ జింటా మళ్లీ తెరపై కనిపించనున్నారు. ‘లాహోర్‌: 1947’తో ప్రీతీ తెరపైకి రావడానికి సిద్ధమవుతున్నారు. సన్నీడియోల్‌ హీరోగా, రాజ్‌కుమార్‌ సంతోషి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పీరియాడికల్‌ యాక్షన్ డ్రామాను స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ప్రీతీ పాత్రకు సంబంధించిన చిత్రీకరణ పూర్తి అయింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఇన్‌స్టా వేదికగా సొట్టబుగ్గల సుందరి ఓ వీడియోను పంచుకున్నారు.

‘లాహోర్‌ 1947లో విజయవంతంగా నా పాత్రకు సంబంధించిన షూటింగ్‌ పూర్తైంది. 1947లో లాహోర్‌లో జరిగిన సంఘటనల్ని చిత్ర యూనిట్ అద్భుతంగా తీర్చిదిద్దుతోంది. నా జీవితంలో ఇప్పటి వరకు నేను నటించిన ప్రాజెక్టుల కన్నా.. కఠినమైన చిత్రం ఇది. నాకు సహకరించిన నటీనటులు, చిత్రబృందానికి ధన్యవాదాలు. అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుందని ఆశిస్తున్నా’ అని సొట్టబుగ్గల సుందరి ప్రీతీ జింటా పేర్కొన్నారు.

Also Read: Actor Karunas: బ్యాగ్‌లో 40 బుల్లెట్లు.. పోలీసులకు పట్టుబడిన నటుడు!

1998లో మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసిన ప్రీతీ జింటా.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న ప్రీతీ.. ఐపీఎల్‌లో పంజాబ్‌ కింగ్స్‌ జట్టుకు సహా యజమానిగా ఉన్నారు. ఆరేళ్ల విరామం తర్వాత మళ్లీ తెరపై కనిపించనున్నారు. ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మది కూడా ప్రీతీ దోచారు. 49 ఏళ్ల ప్రీతీ 2016లో జీన్ గూడెనఫ్‌ను వివాహం చేసుకున్నారు. జీన్, ప్రీతీలకు సరోగసి విధానంలో కవల పిల్లలు జన్మించారు.

Show comments