NTV Telugu Site icon

Preity Zinta : మణిరత్నం సర్ మేకప్ వద్దన్నారు జోక్ చేస్తున్నారనుకున్నా.. కానీ

Whatsapp Image 2024 02 09 At 2.21.11 Pm

Whatsapp Image 2024 02 09 At 2.21.11 Pm

తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన సినిమాలలో ప్రేక్షకుల మదిలో నిలిచిపోయిన సినిమా ‘దిల్ సే’.. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్ హీరోగా నటించారు.క్యూట్ బ్యూటీ ప్రీతి జింతా హీరోయిన్ గా నటించింది.’దిల్ సే’ మూవీ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సినిమా..ఇప్పటికీ ఈ సినిమా పాటలు ఎవర్ గ్రీన్ అని చెప్పొచ్చు.అయితే తాజాగా ఆ సినిమా చేస్తున్నప్పటి మెమోరీస్ ని పంచుకున్నారు ప్రీతి జింతా. మణి రత్నం సర్ తో వర్క్ చేయడం నిజంగా ఎక్సైటెడ్ గా అనిపించిందని ఆమె అన్నారు. ఇక ‘దిల్ సే’ షూటింగ్ ఫస్ట్ రోజు దిగిన ఫొటోను షేర్ చేసిన ఆమె.. ఆసక్తికర విషయాలు పోస్ట్ చేశారు.’దిల్ సే’ సినిమాలో తాను మేకప్ లేకుండా నటించానని ప్రీతి జింతా చెప్పారు. డైరెక్టర్ తనను మేకప్ తీసేయమని చెప్పారని, ఫ్రెష్ ఫేస్ తో షూటింగ్ చేశారని ఆమె అన్నారు. దానికి సంబంధించి ఫొటోను షేర్ చేశారు.

దిల్ సే షూటింగ్ మొదటిరోజు ఈ ఫొటో తీశారు. “మణిరత్నం సార్, షారుఖ్ ఖాన్ తో వర్క్ చేస్తున్నందుకు చాలా ఎక్సైటెడ్ గా అనిపించింది. అలా షూటింగ్ స్పాట్ కి వెళ్లిన వెంటనే మణిసార్ నాకు షాక్ ఇచ్చారు. ఫేస్ వాష్ చేసుకోమన్నారు. సార్ మేకప్ పోతుంది కదా? అంటే.. “అవును మేకప్ లేకుండా, ఫ్రెష్ ఫేస్ తో షూట్ చేద్దాం” అని చెప్పి.. మేకప్ లేకుండానే షూట్ చేశారు ” అని తను పోస్ట్ చేసిన క్యూట్ ఫొటో కింద రాసుకొచ్చారు ప్రీతి.ఈ సందర్భంగా ఆమె మరొకరిని కూడా గుర్తు చేసుకున్నారు. ఆయనే సినిమాటోగ్రఫర్ సంతోషి శివన్. మేకప్ లేకపోయిన తనని చాలా అందంగా చూపించారని ఆమె గుర్తు చేసుకున్నారు. ఫ్రెష్ ఫేస్ తో షూట్ చేసినా చాలా అందంగా కనిపించేలా చేసిన అమేజింగ్ సినిమాటోగ్రాఫర్ సంతోషి శివన్. ‘దిల్ సే’ సినిమాకి ఆయనే అనుకుంటా నా సీన్స్ షూట్ చేసింది.. అని అప్పటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు ప్రీతి. ఆమె క్యూట్ ఫొటో చూసిన ఫ్యాన్స్ ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు.