Preity Zinta Dream: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్!
- సీపీఎల్ 2024 ఫైనల్లో సెయింట్ లూసియా విజయం
- సీపీఎల్‌లో ఇదే తొలి టైటిల్
- నెరవేరిన ప్రీతీ జింటా కల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Preity Zinta Dream Comes True: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో ట్రోఫీ గెలవని జట్లలో ‘పంజాబ్ కింగ్స్’ టీమ్ కూడా ఒకటి. ట్రోఫీ సంగతి పక్కనపెడితే.. గత 17 సీజన్‌లలో ఒక్కసారి కూడా ఫైనల్‌కు చేరలేదు. మధ్యలో పేరు మార్చుకున్నా (కింగ్స్ ఎలెవన్ పంజాబ్ నుంచి పంజాబ్ కింగ్స్) ప్రయోజనం లేకపోయింది. దాంతో బాలీవుడ్ నటి, పంజాబ్ కింగ్స్ సహ యజమాని ప్రీతి జింటా టైటిల్ కల అలానే ఉండిపోయింది. ఎట్టకేలకు ప్రీతీ కప్ కల నెరవేరింది. అయితే అది ఐపీఎల్‌లో కాదు.. కరేబియన్ ప్రీమియర్ లీగ్‌లో.
ఆదివారం గయానాలో జరిగిన సీపీఎల్ 2024 ఫైనల్లో గయానా అమెజాన్ వారియర్స్‌పై సెయింట్ లూసియా కింగ్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గయానా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ప్రిటోరియస్ (25; 12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు), షై హోప్ (22; 24 బంతుల్లో 4 ఫోర్లు) రాణించారు. నూర్ అహ్మద్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో సెయింట్ లూసియా 18.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ఆరోన్ జోన్స్ (48 నాటౌట్; 31 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లు), రోస్టన్ ఛేజ్ (39 నాటౌట్; 22 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) దంచికొట్టారు.
Also Read
Also Read: IPL 2025 Auction: భారత జట్టులో ఆరుగురు ఆటగాళ్లకు చోటు.. ఐపీఎల్ ప్రాంచైజీలకు పెద్ద బొక్క!
సీపీఎల్‌లో సెయింట్ లూసియా కింగ్స్ ఫ్రాంచైజీకి ఇదే తొలి టైటిల్. 2013లో సీపీఎల్‌లో అడుగుపెట్టిన సెయింట్ లూసియా.. ఎట్టకేలకు ట్రోఫీ సాధించింది. దాంతో బాలీవుడ్ నటి ప్రీతి జింటా ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. మైదానంలో ఆమె సందడి చేశారు. ప్రీతీ జింటా కల నెరవేరిందోచ్ అంటూ ఫాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. నెస్ వాడియా, మోహిత్ బుమ్రాన్, కరన్ పాల్ కూడా సెయింట్ లూసియా ప్రాంచైజీకి యజమానులే. ఐపీఎల్‌లో పంజాబ్ కింగ్స్ కూడా కప్ కొట్టాలని అందరూ కోరుకుంటున్నారు.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!