టెక్నాలజీ ఎంతగా అభివృద్ధి చెందినా గిరిజన ప్రాంతాల్లో గర్భిణీల ఇక్కట్లు మాత్రం తగ్గడం లేదు. అల్లూరి జిల్లాలో మరోసారి నిండు గర్భిణీ కష్టాలు వెలుగు చూసాయి.. నిన్న మధ్యాహ్నం అల్లూరి జిల్లా చింతపల్లి మండలం అంజలి శనివారం పంచాయితీ పాలమామిడిలో గర్భిణీ అష్ట కష్టాలు పడింది. ప్రభుత్వాలు మారుతున్న ఏజెన్సీల్లో ప్రజల జీవన విధానంలో ఎటువంటి మార్పు లేదని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమామిడి గ్రామానికి చెందిన గర్భిణీ స్త్రీ నిన్న మధ్యాహ్నం దేనికి పురిటి నొప్పులు మొదలయ్యాయి.
Read Also: IPL 2023: ఐపీఎల్ ప్రారంభానికి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు కష్టాలు
పాలమామిడి నుంచి మాడేబందకు కేవలం ద్విచక్ర వాహనం వెళ్లే మార్గం ఒక్కటే వాళ్ళకి దిక్కు. అదే మార్గం గుండా గర్భిణీ స్త్రీని ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్తుండగా మార్గమధ్యంలోని నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి. అటవీ ప్రాంతం మధ్యలోనే ఆమె పురుడు పోసుకుంది. అక్కడి నుంచి అతి కష్టం మీద మాడేబందకు చేరుకున్నారు. మాడబంధ నుంచి తాజంగి లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తల్లి,బిడ్డను అంబులెన్స్ లో తరలించారు. రెండవ బిడ్డకు జన్మనిచ్చింది దేవి,. ఆమెకు పుట్టిన మగ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు నిర్ధారించారు. 150 మంది నివాసం ఉంటున్న పాలమామిడి నుంచి మాడిబంద వరకు రోడ్డు మార్గాన్ని వేయాలంటూ ప్రభుత్వానికి గిరిజన సంఘాలు డిమాండ్ చేశాయి. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తప్పదని గిరిజన సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
Read Also: Air India: ఈ ఏడాది 5100 మంది క్యాబిన్ క్రూ, పైలట్ల నియామకం