NTV Telugu Site icon

Group-2 Exam: పురుటి నొప్పులతోనే గ్రూప్‌-2 పరీక్ష రాసిన అభ్యర్థి

Group 2 Exam

Group 2 Exam

Group-2 Exam: పురుటి నొప్పులతోనే ఓ అభ్యర్థి గ్రూప్‌-2 పరీక్ష రాసిన ఆసక్తికర ఘటన నాగర్‌కర్నూల్‌ జిల్లాలో చోటుచేసుకుంది. బల్మూరు మండలం బాణాల గ్రామానికి చెందిన రేవతి అనే నిండు గర్భిణీ మహిళ నాగర్‌ కర్నూల్ పట్టిన జెడ్పీ హైస్కూల్‌లో గ్రూప్‌-2 పరీక్ష రాసేందుకు వెళ్లారు. పరీక్ష రాస్తున్న సమయంలోనే ఆమెకు పురుటి నొప్పులు రాగా.. అప్రమత్తమైన పరీక్ష నిర్వహణ అధికారులు..ఆమెను హాస్పిటల్‌కు తీసుకెళ్లేందుకు సిద్ధం అయ్యారు. అందుకు ఆమె అంగీకరించకుండా.. పరీక్ష రాస్తానని పట్టుబట్టారు. మరోవైపు ఆమె కాన్పు తేదీ కూడా ఇవాళే కావడంతో పరీక్ష నిర్వహణ సిబ్బంది కాస్త ఆందోళనకు గురయ్యారు. పురుటి నొప్పులు వస్తున్నా పరీక్ష రాస్తానని చెప్పడంతో అధికారులు ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్లారు. పరీక్షా కేంద్రంలో 108 అంబులెన్స్‌ను కూడా సిద్ధంగా ఉంచారు. ఆ గర్భిణి కోసం ప్రత్యేక వైద్య సిబ్బందిని ఏర్పాటు చేసి.. ఎప్పుడు తీవ్ర నొప్పులు వచ్చినా ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అన్నీ సిద్ధంగా ఉంచారు. పరీక్షా కేంద్రం వద్ద రేవతి భర్త, తల్లి అందుబాటులో ఉంచారు. ఆ నొప్పులతోనే అభ్యర్థి పరీక్షను పూర్తి చేశారు.

Read Also: Israel-Gaza: ఇజ్రాయెల్ దాడిలో జర్నలిస్ట్ జజీరా మృతి, ఉగ్రవాదిగా ఐడీఎఫ్ వెల్లడి