Site icon NTV Telugu

Hyderabad: బాలానగర్‌లో విషాదం.. డెలివరి చేసిన స్టాఫ్ నర్స్.. తల్లి బిడ్డా మృతి..

Balanagar

Balanagar

హైదరాబాద్ బాలానగర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ప్రసవానికి వచ్చిన గర్భిణి, అప్పుడే పుట్టిన బాబు మృతి చెందారు. స్టాఫ్ నర్స్ గర్భిణీ స్ర్తీకి డెలివరి చేసింది. ఆయమ్మ సహాయంతో.. ఇద్దరూ కలిసి డెలివరి చేయడంతో తల్లి, బిడ్డ పరిస్థితి విషమంగా మరి మృత్యువాత పడ్డారు.. తల్లీబిడ్డ మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని సంగారెడ్డి కి చెందిన బాధితురాలు అరుణ (22) బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆస్పత్రి వైద్యులు నిర్లక్ష్యపు సమాధానం ఇస్తున్నారు .. ముందే అన్ని టెస్టులు చేయించుకుని రావాలని.. కానీ అప్పటికప్పుడు వచ్చి డెలివరి అంటే ఇలానే అవుతుందని సమాధానమిచ్చారు. వీక్ ఎండ్ కదా అని ఇంటికి తొందరగా వెళ్ళామని డ్యూటీ డాక్టర్స్ చెబుతున్నారు.

READ MORE: Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్‌కు ప్రభాకర్ రావు..!

అయితే ఈ అంశంపై డిలివరీ చేసి స్టాఫ్ నర్స్ తన స్పందించింది. “పురిటి నొప్పులతో గర్భిణీ, తన తల్లి 30న రాత్రి 7 గంటలకు వచ్చారు.. నొప్పులతో అల్లాడుతోంది.. నిలోఫర్ తీసుకెళ్ళండి అని చెప్పాను.. అప్పటికే నొప్పులు మరింత ఎక్కువ అయ్యాయి.. హాస్పిటల్ లో నేను, ఆయమ్మ తప్ప ఎవరూ లేరు.. ఇద్దరం కలిసి డెలివరి చేశాం.. మగ బిడ్డ పుట్టాడు. పుట్టిన బిడ్డ ఏడ్వక పోవడంతో.. అంబులెన్స్ లో నిలోఫర్ కి తరలించాం.. తల్లి ని హాస్పిటల్ లోనే ఉంచుకున్నాం. ఓ గంట తర్వాత తల్లి చనిపోయింది.. నిలోఫర్ కి వెళ్ళే లోపు బాబు కూడా చనిపోయాడు.. నేను డెలివరి ప్రాసెస్ అంతా కరెక్ట్ గానే చేశాను..” అని స్టాఫ్ నర్సు వెల్లడించింది.

READ MORE: Phone Tapping Case: ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం.. హైదరాబాద్‌కు ప్రభాకర్ రావు..!

Exit mobile version