Sangareddy: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడిచింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం ముగిసింది. అయినా కొన్ని గ్రామాలు, ఏజెన్సీ ప్రాంతాలకు రోడ్లు లేకపోవడం మన నాయకులు చెత్త పాలనకు అద్దంపడుతోంది. గిరిజన గ్రామాల్లో సైతం రోడ్డు సౌకర్యాలు లేక ఆ గిరిజనులు పడుతున్న నరకయాతన వర్ణనాతీతం. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో అలాంటి ఓ తండా వెలుగులోకి వచ్చింది. సంగారెడ్డి జిల్లా నాగల్ గిద్ద మండలం మున్యా నాయక్ తండాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తండాలోకి వెళ్లేందుకు అంబులెన్స్ కి రోడ్డు మార్గం లేక గర్భిణీ కష్టాలు పడింది.. ఆశా కార్యకర్తల సహాయంతో 2 కిలోమీటర్ల వరకు గర్భిణీని కుటుంబ సభ్యులు వీపుపై మోసుకెళ్లారు. ఆమె సుమారు గంట పాటు నరకయాతన అనుభవించింది. మార్గ మధ్యలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం అంబులెన్స్ లో నారాయణఖేడ్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. తండాకు రోడ్డు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
READ MORE: Merugu Nagarjuna: మాపై దాడులు చేసి కేసులు పెట్టడం.. న్యాయమా.. ధర్మమా!
