NTV Telugu Site icon

Preganancy Tips: గర్భధారణ సమయంలో మహిళలు ఈ ఉత్పత్తులు వాడకూడదు.. పిల్లలకి ప్రమాదం!

Pregnancy Tips

Pregnancy Tips

Side Effects of Beauty Products on Preganancy: గర్భధారణ సమయంలో మహిళలు తమను తాము మాత్రమే కాకుండా.. పుట్టబోయే బిడ్డను కూడా ఎంతో జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. తీసుకునే ఆహరం నుంచి వేసుకునే దుస్తువుల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆహరం విషయంలో మాత్రమే కాకూండా.. మేకప్ ఉత్పత్తులను ఉపయోగించేటప్పుడు కూడా కొన్ని విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మహిళలు మేకప్ వేసుకోవడానికి చాలా ఇష్టపడతారు. గర్భధారణ సమయంలో కూడా బయటికి వెళ్లినపుడు మేకప్ వేస్తుంటారు. అలా చేయడం పుట్టబోయే బిడ్డకు హానికరం. గర్భధారణ సమయంలో మహిళలు ఏ మేకప్ ఉత్పత్తులను ఉపయోగించకూడదో చూద్దాం.

లిప్ స్టిక్:
గర్భధారణ సమయంలో మహిళలు లిప్‌స్టిక్‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇందులో ఉండే రసాయనం కొంత సమయం తర్వాత మీ శరీరంలోకి వెళ్లిపోతుంది. ఇది మీ బిడ్డకు హాని కలిగిస్తుంది. అందుకే మహిళలు గర్భధారణ సమయంలో లిప్‌స్టిక్‌ను వాడకూడదు.

పెర్ఫ్యూమ్:
గర్భధారణ సమయంలో మహిళలు డియోడరెంట్ మరియు పెర్ఫ్యూమ్ వంటి వాటిని ఉపయోగిస్తారు. గర్భధారణ సమయంలో వీటిని అస్సలు ఉపయోగించకూడదు. ఎందుకంటే వీటిని తయారుచేసేటప్పుడు రసాయనాలు వాడుతారు కాబట్టి పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. అంతేకాకుండా ప్రగ్నెన్సీ లేడీస్‌కు అలర్జీ, దురద వంటి సమస్యలు రావచ్చు.

Also Read: Best CNG Cars Under 10 Lakh: ధర తక్కువ, మైలేజ్ ఎక్కువ.. బెస్ట్ సీఎన్‌జీ కార్స్ ఇవే!

జుట్టుకు రంగు:
మహిళలు తమ నెరిసిన జుట్టును దాచుకోవడానికి తరచుగా హెయిర్ డైని ఉపయోగిస్తారు. కానీ గర్భధారణ సమయంలో మహిళలు జుట్టు రంగుకు దూరంగా ఉండాలి. రంగులో ఉండే అమ్మోనియా చర్మానికి హానికరం.

హెయిర్ రిమూవర్ క్రీమ్:
గర్భధారణ సమయంలో మహిళలు హెయిర్ రిమూవర్ క్రీమ్ వాడకుండా ఉండడం మంచిది. ప్రెగ్నెన్సీ సమయంలో శరీరంలో హార్మోన్ల మార్పు ఉంటుంది. అప్పుడు కెమికల్ అధికంగా ఉండే హెయిర్ రిమూవల్ క్రీమ్స్ వాడితే చర్మ అలెర్జీలకు కారణం కావచ్చు.

Also Read: Asia Cup 2023 Schedule: ఆసియా కప్ 2023 షెడ్యూల్‌.. సెప్టెంబర్ 2న భారత్-పాకిస్తాన్ మ్యాచ్!