Site icon NTV Telugu

Preeti Sudan: యూపీఎస్సీ కొత్త ఛైర్‌పర్సన్‌గా ప్రీతి సుదాన్‌..

Upsc

Upsc

Preeti Sudan has UPSC Chairperson: 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, మాజీ కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ప్రీతి సూడాన్ యూపీఎస్సీ కొత్త చైర్‌పర్సన్ గా నియమితులయ్యారు. నెల రోజుల క్రితం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చైర్మన్ మనోజ్ సోనీ పదవీ కాలం ముగియకముందే రాజీనామా చేశారు. మనోజ్ సోనీ స్థానంలో ప్రీతీ సుడాన్ ఆగస్టు 1 నుంచి బాధ్యతలు చేపట్టనున్నారు. కొత్త యూపీఎస్సీ ఛైర్‌ పర్సన్ ప్రీతి సుదాన్ గురించి చూస్తే..

Kerala : భూతల స్వర్గం నేడు నరకం అయింది.. కేరళలో వరదలు, విపత్తుల చరిత్ర ఇదే !

ప్రీతి సుడాన్ 2022 సంవత్సరంలో యూపీఎస్సీలో చేరారు. తాజాగా ఆమె చైర్‌ పర్సన్ పదవికి నియమితులయ్యారు. హర్యానా నివాసి ప్రీతి సుడాన్ 1983లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది. యూపీఎస్సీ మాత్రమే కాదు, ప్రీతి సుడాన్ మహిళా, శిశు అభివృద్ధి & రక్షణ మంత్రిత్వ శాఖతో పాటు.. ఆహార, ప్రజా పంపిణీ శాఖ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రీతి ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన ఐఏఎస్. 37 సంవత్సరాల విస్తృత అనుభవంతో జూలై 2020లో కేంద్ర ఆరోగ్య కార్యదర్శిగా పదవీ విరమణ చేశారు. యూపీఎస్సీలో చేరిన తర్వాత ఆమె చాలా ముఖ్యమైన నిర్ణయాలలో సరైన పనులను నిర్వహించారు. ప్రీతీ సుడాన్ ప్రధానమైన బేటీ బచావో, బేటీ పడావో ప్రచారం, ఆయుష్మాన్ భారత్ మిషన్ కాకుండా నేషనల్ మెడికల్ కమిషన్, అలైడ్ హెల్త్ ప్రొఫెషనల్ కమీషన్ పనికి దోహదపడింది. ఇది కాకుండా, ఈ-సిగరెట్‌లపై నిషేధంపై చట్టం చేసిన ఘనత ప్రీతి సుడాన్‌ కు దక్కింది. ప్రీతి సుడాన్ విద్యార్హత గురించి చూస్తే., ఆమె ఎకనామిక్స్‌లో ఎం.ఫిల్ డిగ్రీని పొందింది. ఇది కాకుండా, ఆమె లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, సోషల్ సైన్స్ LSE, లండన్ నుండి సోషల్ సైన్స్‌లో MSc చేసారు.

Prabhas: టాలీవుడ్ లో ఒకే ఒక్కడు ఉప్పలపాటి ప్రభాస్..ఇంక ఎవరి వల్ల కాదు..

యూపీఎస్సీ ఛైర్మన్, సభ్యులు నేరుగా రాష్ట్రపతిచే నియమింపబడతారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 316(1) ప్రకారం ఈ నియామకం జరిగింది. కనీసం సగం మంది సభ్యులు సివిల్ సర్వీస్‌లో సభ్యులుగా ఉన్నవారు (పనిచేస్తున్నవారు లేదా పదవీ విరమణ పొందినవారు) భారత ప్రభుత్వం లేదా రాష్ట్రం క్రింద కనీసం 10 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఆర్టికల్ 317 ప్రకారం, రాష్ట్రపతి మాత్రమే.. యూపీఎస్సీ చైర్మన్, ఇతర సభ్యులను వారి పదవుల నుండి తొలగించగలరు. యూపీఎస్సీ సభ్యులు చేరిన తేదీ నుండి 6 సంవత్సరాలు లేదా వారు 65 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు (ఏది అంతకు ముందు అయితే) వారి పదవులను కలిగి ఉంటారు. రాష్ట్ర కమిషన్ లేదా జాయింట్ కమిషన్ సభ్యులకు వయోపరిమితి 62 సంవత్సరాలు.

Exit mobile version