NTV Telugu Site icon

liver: బీ అలర్ట్.. ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం చెడిపోబోతుందని అర్థం

Liver 1

Liver 1

Precautions To take for Liver Health: కాలేయం మానవుని శరీరంలోని అతి పెద్ద గ్రంథి.  శరీరం ఆరోగ్యంగా ఉండటంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. ఆహారాన్ని జీర్ణం చేసి, శక్తిగా మార్చి, వ్యర్థాలను బయటకు పంపడంలో దీని పాత్ర ప్రధానమైనది. అందుకే లివర్ ఆరోగ్యం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. అయితే కాలేయం పాడైపోయేటప్పుడు మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. రక్తం నుంచి టాక్సిన్లను కాలేయం ఎప్పటికప్పుడు బయటకు పంపిస్తుంటుంది. అయితే ఒకవేళ కాలేయం కనుక దాని పనిని సరిగా చేయలేకపోతుంటే మనకు కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.

Also Read: Tomato Price: అప్పుడు ఆకాశానికి.. ఇప్పుడు పాతాళానికి.. టమాటా రైతును ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు

వాటిలో ప్రధానమైనది చర్మంపై దద్దురులు, దురదలు రావడం. ఇలా తరచూ కనిపిస్తుంటే మన చర్మం పాడైపోతున్నట్లు గుర్తించవచ్చు. కాలేయం  బైల్ రూబిన్ అనే దానిని ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. ఒక వేళ వ్యర్థ పదార్థాలు పెరిగిపోతే ఇది ఎక్కువగా విడుదల అయ్యి కళ్లు, చర్మం పసుపు రంగులోకి మారిపోతుంది. మలం రంగు పేల్ కలర్ లో కనిపిస్తుంది. ఇక మూత్రం రంగు అయితే చిక్కగా మారిపోతుంది. కాలేయం సరిగా పనిచేయనప్పుడు వాంతులు కావడం, తలతిరగడం లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి పోషకాలను గ్రహిస్తుంది కాలేయం. దెబ్బలు తగిలినప్పుడు చర్మం కింద రక్తస్రావం అయినట్టు మచ్చలు కనిపించినా, సాలెగూడుమ మాదిరి చర్మంపై మచ్చలు కనిపించినా సరే అది కాలేయ సమస్యలకు సంకేతంగా భావించవచ్చు.

ఇక కాలేయ ఆరోగ్యం బాగుండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. మద్యం సేవించడం  లివర్ చెడిపోవడానికి కారణం అవుతుంది. అందుకే వీలైనంత వరకు మద్యానికి దూరంగా ఉండాలి. నాణ్యత కలిగిన నూనెను మాత్రమే వంటకాలకు ఉపయోగించాలి ఎందుకంటే సరైన నూనె వాడకపోయినా లివర్ దెబ్బతినే అవకాశం ఉంది. పూర్తిగా ఉడికిన ఆహారాన్ని తింటేనే కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. దయం నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తప్పనిసరిగా తీర్చుకోవాలి. లేదంటే లివర్‌లో వ్యర్థాలు పెరిగిపోతాయి. తిగా ఆహారం తీసుకున్నా లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇక మరో ముఖ్యమైన విషయం ఏంటంటే  చిన్నచిన్న అనారోగ్య సమస్యలకే మందులను అతిగా తీసుకున్నా లివర్ చెడిపోయేందుకు అవకాశం ఉంటుంది అందుకే  వీలైనంత వరకు మందులను తక్కువగా, వైద్యుల సలహా మేరకు మాత్రమే వాడాలి.