NTV Telugu Site icon

Pre Wedding Shoot Viral : పెళ్లిలో ప్రైవేట్ వీడియో.. సిగ్గుతో కళ్లు మూసుకున్న వరుడు

New Project (8)

New Project (8)

Pre Wedding Shoot Viral : ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్ అనేది ట్రెండ్‌గా మారింది. ఈ ప్రీ వెడ్డింగ్ వీడియో పెళ్లి రోజు మండపంలో పెద్ద స్క్రీన్‌పై ప్రదర్శించబడుతుంది. అలాంటి పెళ్లికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ప్రీ వెడ్డింగ్‌ని చూపించారు. అయితే ప్రీ వెడ్డింగ్ వీడియో చూపిస్తూ భార్యాభర్తలిద్దరూ షాక్ అయ్యారు. పెళ్లికి ముందు భార్యాభర్తల ఆ ప్రైవేట్ వీడియో అందరి ముందుకు వచ్చింది. ఈ సందర్భంలో వధూవరులు ఇద్దరూ సిగ్గుతో తలదించుకున్నారు.

Read Also: Healthy Food: పోషకాలకు పుట్టినిల్లు ఈ ఆహార పదార్ధాలు

ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పెళ్లికి ముందు చూడకూడని భార్యాభర్తల సీన్ హఠాత్తుగా చూశారు. ఆ దృశ్యం వచ్చినప్పుు ఇద్దరి ముఖ కవళికలు చూడాల్సిందే. మండపంలో భార్యాభర్తలు కనిపించడం వీడియోలో చూడవచ్చు. మెడలో వరమాలతో కనిపిస్తున్నారు. ఇద్దరూ నిలబడతారు. వారి ముందు పెద్ద స్క్రీన్‌పై వీడియో ప్లే అవుతుంది. వారిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం కనిపిస్తుంది. వారి ఆ ప్రైవేట్ మూమెంట్ అందరి ముందుకు వస్తుంది. ఆ తర్వాత, పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరూ తమ జేబులో నుండి మొబైల్ ఫోన్‌లలో వధూవరుల ఈ ప్రైవేట్ క్షణాన్ని తమ కెమెరాలలో బంధించడం ప్రారంభించారు.

Read Also:Vande Bharat Express: స్పీడ్‌లో వందే భారత్ ట్రైన్ రికార్డ్.. గరిష్ట వేగాన్ని దాటి పరుగు..

ఇది చూసిన తరువాత, వారిద్దరికీ ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియక అక్కడే నిలబడి వీడియో చూస్తూ ఉండిపోయారు. ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దీనిపై అనేక కామెంట్లు వస్తున్నాయి. వధూవరులకు ఇలా జరగకూడదని కొందరు నెటిజన్లు అంటున్నారు. కొంత మంది ఎంజాయ్ చేశారు.

Show comments