NTV Telugu Site icon

Mechanic Rocky : ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు టైమ్ ఫిక్స్ చేసుకున్న ‘మెకానిక్ రాకీ’

Mechanic

Mechanic

Mechanic Rocky : ఇటీవల కాలంలో వరుస హిట్లతో దూసుకుపోతున్నారు మాస్ కా దాస్ విశ్వక్ సేన్. త్వరలో మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్ మెకానిక్ రాకీతో రాబోతున్నాడు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. రామ్ తాళ్లూరి తన బ్యానర్ ఎస్ ఆర్టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమాను భారీ బడ్జెట్ పై నిర్మించారు. విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ మధ్య ట్రయాంగిల్ లవ్ నేపథ్యంలో వస్తున్న మెకానిక్ రాకి ట్రైలర్ రిలీజ్ అయి అద్భుతమైన స్పందన అందుకుంది. షూటింగ్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా నవంబరు 22న రిలీజ్ కానుంది.

Read Also:Haryana: వీర్యం విక్రయం ద్వారా నెలకు రూ. 5 లక్షలు.. మనిషిది కాదు..

మరికొద్ది రోజుల్లో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో కాస్త వెనుకబడింది అనే విశ్వక్ ఫ్యాన్స్ ఎప్పటి నుండో వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మెకానిక్ రాకీ కోసం సూపర్ వీక్ ప్రమోషన్స్ ప్లాన్ చేశాడు విశ్వక్ సేన్. విడుదల వారం ముందు నుండి ప్రమోషన్లు మొదలపెట్టి రిలీజ్ రోజు వరకు ఏకధాటిగా సినిమాను ఆడియెన్స్ లోకి తీసుకెళ్లలేందుకు మాస్ ప్లానింగ్ చేశాడు. ఈ సినిమా ప్రమోషన్స్‌ను వేగంగా నిర్వహిస్తున్న చిత్ర యూనిట్.. ఈ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు రెడీ అయిపోయింది. ఈ నెల 17న సాయంత్రం 5 గంటల నుండి ఈ గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను వరంగల్‌లోని జెఎన్ఎస్‌డబ్ల్యూ ఇండోర్ స్టేడియం‌లో నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్‌లో చిత్రానికి సంబంధించిన రెండో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ సినిమాకు జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.

Read Also:CM Chandrababu in Delhi: హస్తినలో ఏపీ సీఎం బిజీబిజీ

Show comments