Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Praveen Kumar Slams Bcci Over Hardik Pandyas Central Contract

Hardik Pandya: హార్దిక్ ఏమైనా చంద్రుడిపై నుంచి దిగొచ్చాడా?.. టీమిండియా మాజీ పేసర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

Published Date :March 15, 2024 , 1:49 pm
By Sampath Kumar
Hardik Pandya: హార్దిక్ ఏమైనా చంద్రుడిపై నుంచి దిగొచ్చాడా?.. టీమిండియా మాజీ పేసర్‌ షాకింగ్‌ కామెంట్స్‌!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇటీవల బీసీసీఐ విడుదల చేసిన సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ లిస్ట్ భార‌త క్రికెట్‌లో పెను దుమారం రేపిన విష‌యం తెలిసిందే. రంజీల్లో ఆడకుండా బోర్డు ఆదేశాలను ధిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో స్టార్ ప్లేయర్స్ ఇషాన్ కిష‌న్, శ్రేయ‌స్ అయ్య‌ర్‌ల‌కు సెంట్ర‌ల్ కాంట్రాక్ట్ రద్దు చేసింది. రెడ్‌బాల్‌ క్రికెట్‌కు దూరంగా ఉంటూ.. రంజీల్లో ఆడ‌కున్నా హార్దిక్ పాండ్యాకు కాంట్రాక్ట్ లిస్టులో చోటు ఇచ్చింది. దీనిపై మాజీ క్రికెట‌ర్లు భిన్నాభిప్రాయాలు వ్య‌క్తం చేస్తున్నారు. తాజాగా టీమిండియా మాజీ పేసర్ ప్ర‌వీణ్ కుమార్ బీసీసీఐ తీరును తప్పుపట్టాడు. ఆటగాళ్లందరినీ బోర్డు సమానంగా చూడాలన్నాడు.

ఓ యూట్యూబ్‌ షోలో ప్ర‌వీణ్ కుమార్ మాట్లాడుతూ.. హార్దిక్ పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి దిగొచ్చాడా? అని బీసీసీఐని ప్రశ్నించాడు. ‘హార్దిక్ పాండ్యా ఏమైనా చంద్రుడిపై నుంచి దొగొచ్చాడా?. హార్దిక్ కూడా ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్య‌ర్‌ల మాదిరిగా దేశ‌వాళీ క్రికెట్ ఆడాల్సింది. అత‌డికి మాత్ర‌మే ప్ర‌త్యేక నియ‌మాలు ఎందుకు?. కాంట్రాక్ట్ విష‌యంలో హార్దిక్‌ను కూడా బీసీసీఐ మందలించాల్సి ఉండే’ అని ప్ర‌వీణ్ కుమార్ మండిపడ్డాడు.

Also Read: MS Dhoni-IPL 2024: ఎంఎస్ ధోనీకి ఇదే చివరి సీజన్‌.. మోకాళ్లు అరిగిపోతున్నప్పటికీ..!

‘హార్దిక్ పాండ్యా దేశవాళీ టీ20 టోర్నీలు ఆడితే చాలదు. మూడు ఫార్మాట్లలోనూ ఆడాలి. ఒకవేళ తాను టెస్టులకు పూర్తిగా దూరమవ్వాలని నిర్ణయించుకుంటే.. బోర్డుకు లేఖ సమర్పించాలి. టెస్ట్ ఫార్మాట్‌ నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించాలి. ఒకవేళ హార్దిక్ టీ20 జట్టుకు మాత్రమే ఆస్తి అని బీసీసీఐ భావిస్తే ఆ విషయాన్ని కూడా స్పష్టంగా చెప్పాలి. బీసీసీఐ ఇలా వ్యవహరించింది కాదు. ఇదే విధానం పాటిస్తే పారదర్శకంగా ఉంటుంది’ అని ప్ర‌వీణ్ కుమార్ పేర్కొన్నాడు. జాతీయ జట్టు తరఫున ఆడనప్పుడు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఆటగాళ్లంతా దేశవాళీ ట్రోఫీలలో ఆడాలని బీసీసీఐ ఇటీవల నిబంధన విధించిన విషయం తెలిసిందే.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • central contract
  • Hardik Pandya
  • Praveen Kumar
  • Praveen Kumar Hardik Pandya

తాజావార్తలు

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Ronin Hero Rat: బొరియలు తవ్వడం కాదు.. బాంబులు పసిగట్టడం దీని స్పెషాలిటీ! గిన్నిస్ రికార్డు సాధించిన ఎలుక..

  • MS Dhoni-Rohit Sharma: ముగిసిన ధోనీ, రోహిత్ శకం.. అభిమానుల మదిలో చెరగని ముద్ర!

  • బిర్యానీని లొట్టలేసుకుంటూ తింటున్నారా.. జర ఇది చూడండి..

ట్రెండింగ్‌

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • బడ్జెట్ ధరలో ‘బ్యాటరీ కింగ్’.. అదిరిపోయే ఫీచర్లతో వచ్చేస్తున్న REDMI A7 Pro 5G..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions