NTV Telugu Site icon

IND Vs IRE: స్మృతి మంధాన బాదుడే బాదుడు.. భారత వన్డే చరిత్రలో రికార్డు స్కోరు!

Smriti Mandhana (1)

Smriti Mandhana (1)

వన్డే క్రికెట్ చరిత్రలో భారత మహిళల జట్టు రికార్డు స్కోరు నమోదు చేసింది. రాజ్‌కోట్‌ వేదికగా ఐర్లాండ్‌తో బుధవారం జరిగిన మూడో వన్డేలో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 435 రన్స్ చేసింది. ఇప్పటి వరకు భారత మహిళా జట్టు అత్యధిక స్కోరు 370/5. ఈ రికార్డును స్మృతి సేన బద్దలు కొట్టింది. ఓవరాల్‌గా మహిళా క్రికెట్ చరిత్రలో ఇది నాలుగో అత్యధిక స్కోరు. 2018లో ఐర్లాండ్‌పై న్యూజిలాండ్‌ 491/4 పరుగులు చేసింది.

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్ తరఫున వన్డేల్లో అత్యధిక స్కోరు కూడా ఇదే కావడం విశేషం. అంతకు ముందు ఈ రికార్డు భారత పురుషుల జట్టు పేరుపై ఉంది. ఇండోర్‌ వేదికగా 2011లో వెస్టిండీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 5 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసింది. కెప్టెన్ స్మృతి మంధాన (135: 80 బంతుల్లో 12 ఫోర్లు, 7 సిక్స్‌లు), ఓపెనర్ ప్రతీకా రావల్ (154: 129 బంతుల్లో 20 ఫోర్లు, ఒక సిక్స్‌) సెంచరీలతో చెలరేగడంతో భారత్ రికార్డు స్కోర్ నమోదు చేసింది.

ఐర్లాండ్‌తో మూడో వన్డేలో భారత్ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసింది. ప్రతీకా రావల్, స్మృతి మంధాన సహా వన్‌డౌన్‌ బ్యాటర్‌ రిచా ఘోష్‌ అర్ధ శతకంతో చెలరేగింది. 42 బంతుల్లో 10 ఫోర్లు, ఒక సిక్సర్‌ సాయంతో 59 పరుగులు సాధించింది. ఐరిష్‌ బౌలర్లలో ఓర్లా ప్రెండెర్‌గాస్ట్‌కు రెండు వికెట్లు దక్కాయి. భారీ ఛేదనలో ఐర్లాండ్ తడబడింది.

Show comments