NTV Telugu Site icon

Prathipati Pulla Rao: కూటమి రాకకు ప్రజలు ఎదురు చూస్తున్నారు

Pratti Paati

Pratti Paati

Prathipati Pulla Rao: కూటమి ప్రభుత్వం కోసం రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ‌ వర్గాలకు జగన్ అన్యాయం చేశారని ఆరోపించారు. నాసిరకం మద్యం వల్ల జనాలు అనారోగ్య పాలౌతున్నారన్నారు. అమ్మ ఒడి నాల్గు ఏళ్ళుగా ఎవరికి వచ్చింది..? అని ప్రశ్నించారు. బటన్ నొక్కి జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు సాగునంపుతారన్నారు.

READ MORE: Pawan Kalyan: పవన్ కళ్యాణ్‌ కార్ కలెక్షన్ ఇదే..

చిలకలూరిపేట టీడీపీ నాయకుల తోలు తీస్తానని వైసీపీ అభ్యర్థి అంటున్నారని.. చిలకలూరిపేటలో ఎటు చూసిన తన బ్రాండే కనిపిస్తుందన్నారు. ఐదేళ్ళలో‌ మంత్రి రజని చేసిన దోపిడీపై సమాధానం చెప్పాలని అడిగారు. వారు ఎంత రెచ్చగొట్టే విధంగా మాట్లాడినా తాను స్పందించనన్నారు. తన గెలుపును ప్రజలు ఎప్పుడో నిర్ణయించారన్నారు. మెజారిటీ కోసం మాత్రమే ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ప్రజాగళం సభ ద్వారా తన సత్తా ప్రధాని, చంద్రబాబు గుర్తించారన్నారు. రాష్ట్రంలో టీడీపీ మెజార్టీ స్థానాలలో ఉందన్నారు. టాప్ టెన్ లో చిలకలూరిపేట ఉంటుందని చెప్పారు.

Show comments