చాలా రోజుల నుంచి టాలీవుడ్ హీరో నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే నారా రోహిత్ 2014లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ప్రతినిధి – 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు మూర్తి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇదివరకే ఈ సినిమాకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేసినా సడన్ గా టీజర్ రిలీజ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు.
Also read: Titanic Door: రోజ్ ప్రాణాలను కాపాడిన తలుపు వేలం.. వామ్మో అన్ని కోట్లకు అమ్ముడబోయిందా..?!
ఇక ఈ టీజర్ ని గమనిస్తే.. పొలిటికల్ అంశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి అలాగే రాష్ట్ర అప్పు లాంటి అంశాలపై ఎక్కువగా సన్నివేశాలు ఉన్నట్లు కనపడుతుంది. ఇక చివర్లో “వచ్చి ఓటు వేయండి.. లేదా దేశం వదిలిపోండి.. లేకపోతే చచ్చిపోండి” అంటూ నారా రోహిత్ సీరియస్ గా డైలాగు చెప్పడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది.
Also read: Tillu Square: టిల్లు స్క్వేర్ సినిమాలో మొత్తం ముగ్గురు హీరోయిన్లు.. ఎవరెవరో తెలుసా
అయితే అతి త్వరలో ఎన్నికలు వస్తున్న సమయంలో ఇలాంటి పొలిటికల్ థ్రిల్లర్ రావడం చేర్చనీయా అంశంగా మారుతుంది. ఇకపోతే ఈ సినిమా మాత్రం వచ్చి ఏడాది రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇక సినిమాలో నారా రోహిత్ ఓ జర్నలిస్ట్ గా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇక టీజర్ గమనిస్తే మన దేశంలో ఎన్నికలు జరిగే విధానం, ఓట్లు కొనుక్కోవడం, అవినీతి గురించి గట్టిగానే డైలాగులు సినిమాలు ఉన్నాయి.