NTV Telugu Site icon

HanuMan : హనుమాన్ కు తొలి అవార్డును అందుకున్న ప్రశాంత్ వర్మ..

Prasanthh

Prasanthh

టాలీవుడ్లో ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమాల్లో హనుమాన్ కూడా ఒకటి.. ఈ సినిమా ఎలాంటి టాక్ ను అందుకుందో తెలిసిందే.. ఎటువంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా వచ్చి బాక్సాఫీస్ రికార్డులను సొంతం చేసుకోవడం మాత్రమే కాదు.. ఇప్పుడు అవార్డును తాజాగా అవార్డును కూడా సొంతం చేసుకుంది.. ఈ సినిమాకు తొలి అవార్డును అందుకున్నట్లు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సోషల్ మీడియా ద్వారా తెలిపారు..

ఈ హనుమాన్ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.350 కోట్లకి పైగా వసూళ్లు సాధించి భారీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఇటీవల ఓటీటీలో అడుగుపెట్టిన హనుమాన్ అక్కడ కూడా రికార్డులు క్రియేట్ చేస్తుంది.. భారీ వ్యూస్ తో దూసుకుపోతుంది.. ఇక హనుమాన్ కు బెస్ట్ డైరెక్టర్ గా అవార్డు రావడంతో డైరెక్టర్ ఆనందం రెట్టింపు అయ్యింది..

ఈ విషయాన్ని డైరెక్టర్ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు.. హనుమాన్‌ సినిమాకి తొలి అవార్డు అందుకున్నాను. థాంక్యూ రేడియో సిటీ అంటూ పోస్ట్ పెట్టారు ప్రశాంత్ వర్మ. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ప్రశాంత్ వర్మకి కంగ్రాట్స్ చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.. మున్ముందు ఇంకా అవార్డులను అందుకుంటారని కామెంట్స్ పెడుతున్నారు.. ఇక సినిమాల విషయానికొస్తే.. ఆక్టోపస్ అనే సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో అనుపమ పరమేశ్వరన్ లీడ్ రోల్‌లో నటిస్తుంది.. ఈ సినిమా తర్వాత జై హనుమాన్ సినిమా చేయబోతున్నాడు..

Show comments