Site icon NTV Telugu

NTR- Neel Dragon Movie: ఇట్స్ అఫీషియల్.. డ్రాగన్ సినీమాలో బాలీవుడ్ సీనియర్ యాక్టర్

Anil Kapoor

Anil Kapoor

NTR- Neel Dragon Movie: కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్‌ కాంబినేషన్‌లో సినిమా రాబోతుంది. ‘డ్రాగన్‌’ (Dragon) తాత్కాలికంగా పేరు ప్రచారంలో కొనసాగుతుంది. ఈ సినిమాను (NTR 31) అధికారికంగా ప్రకటించినప్పటీ నుంచి అభిమానులు దీని అప్‌డేట్స్‌ కోసం ఎంతో ఆసక్తిగా వేచి చూస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ సీనియర్ నటుడు అనిల్‌ కపూర్‌ కీలక పాత్రలో కనిపించనున్నట్లు చాలా రోజులుగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు వాటిని ధ్రువీకరిస్తూ అనిల్‌ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో స్టోరీ పెట్టారు.

Read Also: Stock Market: బీఎంసీ ఎగ్జిట్ ఫలితాలు ఎఫెక్ట్.. భారీ లాభాల్లో సూచీలు

అయితే, డ్రాగన్‌ మూవీ పోస్టర్‌ను పంచుకున్న ఆయన ‘ఒక సినిమా వచ్చేసింది మరో రెండు లైనప్‌లో ఉన్నాయంటూ (Dragon Update) పేర్కొన్నాడు. ఎన్టీఆర్‌తో కలిసి అనిల్‌ కపూర్‌ నటిస్తున్న రెండో మూవీ ఇది. గతంలో వీరిద్దరూ ‘వార్‌ 2’లో కలిసి యాక్ట్ చేశారు. అలాగే, సందీప్‌ రెడ్డి వంగా ‘యానిమల్‌’ తర్వాత రెండోసారి సౌత్ ఇండియన్ డైరెక్టర్ చిత్రంలో అనిల్‌ నటిస్తున్నారు. అయితే, అనిల్ కపూర్ ఏ పాత్రలో కనిపిస్తారు అనే దానిపై ఇంకా క్లారిటీ మాత్రం రాలేదు.

Read Also: Trump-Machado: ట్రంప్‌తో మచాడో భేటీ.. నోబెల్ శాంతి బహుమతి అందజేత

కాగా, ‘దేవర’ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌… ‘సలార్‌’ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ చేస్తోన్న చిత్రం ఇది. ఎన్టీఆర్‌ సరసన ఇందులో రుక్మిణీ వసంత్‌ (Rukmini vasanth) యాక్ట్ చేస్తుంది. పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో తారక్‌ గతంలో ఎప్పుడు చేయని మాస్‌ పాత్రలో.. వైరైటీ లుక్‌తో కనిపించనున్నారు. కాగా, సంక్రాంతి పండగ సందర్భంగా శంషాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన ఎన్టీఆర్ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. ఈ ఫోటోల్లో ఆయన లుక్ అదిరిపోయింది.

Exit mobile version