Prashanth Neel : ఎన్టీఆర్ తో చేసే సినిమా ఎంతో విభిన్నంగా ఉంటుంది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ తాజాగా ప్రభాస్ తో సలార్ మూవీని తెరకెక్కిస్తున్నారు.తాజాగా రిలీజ్ అయిన సలార్ సీజ్ ఫైర్ 1 ట్రైలర్ సినిమా పై వున్న హైప్ ను మరింతగా పెంచేసింది.ఈ సినిమా డిసెంబర్ 22 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ఇదిలా ఉంటే కేజిఎఫ్ ఫ్రాంఛైజీలో కేజీఎఫ్ 3 కూడా రాబోతోందని డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కన్ఫమ్ చేశారు.తాజాగా పింక్‌విల్లాతో మాట్లాడిన ప్రశాంత్ నీల్ కేజీఎఫ్ 3 కచ్చితంగా వస్తుందని, అయితే తాను డైరెక్టర్ గా ఉంటానా లేదా అన్నది మాత్రం చెప్పలేనని తెలిపారు.ప్రస్తుతం సలార్ రిలీజ్ కోసం వేచి చూస్తున్న ప్రశాంత్ నీల్.. కేజీఎఫ్ 3 పై చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.కేజీఎఫ్ 3 కచ్చితంగా వస్తుంది. నేను డైరెక్టర్ నా కాదా అన్నది నాకు తెలియదు. కానీ యశ్ మాత్రం కచ్చితంగా అందులో నటిస్తారని తెలిపారు.
అంతేకాదు మా దగ్గర స్క్రిప్ట్ కూడా సిద్ధంగా ఉంది. అనౌన్స్ చేసే ముందు స్క్రిప్ట్ పై ఓ నిర్ణయానికి వచ్చాం. యశ్ చాలా బాధ్యతాయుతమైన వ్యక్తి. కేవలం కమర్షియల్ కారణాలతోనే పని చేయడు. అంతా సిద్ధంగా ఉన్నదని ధృవీకరించుకున్న తర్వాతే కేజీఎఫ్ 2 చివర్లో మరో పార్ట్ అనౌన్స్ చేశాం.. అని ప్రశాంత్ నీల్ చెప్పారు.ఇదిలా ఉంటే సలార్ తర్వాత ప్రశాంత్ నీల్ జూనియర్ ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్31 గా పిలువబడుతున్న ఈ సినిమాకు ఇంకా టైటిల్ పెట్టలేదు. అయితే ఈ సినిమా స్టోరీ గురించి ప్రశాంత్ స్పందించాడు. ఇది చాలా కొత్త స్టోరీ అని ఆయన అన్నారు.భిన్నమైన ఎమోషన్లతో సాగే ఓ భిన్నమైన సినిమా ఇది. జానర్ గురించి ఇప్పుడు నేనేమీ చెప్పను. కానీ ఇదొక యాక్షన్ సినిమా అని అభిమానులు అనుకుంటారు. నాకు మాత్రం నేను ప్రేక్షకులకు చెప్పాలనుకున్న కొత్త స్టోరీ ఇది. దానికి తగిన ఎమోషన్ కూడా ఇందులో ఉంది అని ప్రశాంత్ నీల్ చెప్పారు.2024లో జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. 2025లో సినిమా రిలీజ్ అవుతుంది. ఆ తర్వాతే అతడు యశ్ తో కేజీఎఫ్ 3 తీసే అవకాశం ఉన్నట్లు సమాచారం.ప్రస్తుతం ఎన్టీఆర్ దేవర మూవీతో బిజీగా ఉన్నారు.
Also Read
- Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
- Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
- CJP: 48 గంటల్లో రాజీనామా చేయాలి.. జ్ఞానేశ్ కుమార్‌కు CJP అల్టిమేటం..
- Iran-US: ఇరాన్ తాజా వార్నింగ్.. మళ్లీ దాడి చేస్తే యుద్ధం హిందూ మహాసముద్రం దాకా విస్తరిస్తుందని హెచ్చరిక
- Tags
- KGF 3
- ntr
- Prashanth Neel
తాజావార్తలు
-
Faria :దళపతి విజయ్ వారసుడు ‘ఫ్యూచర్ సీఎం’ .. సంజయ్‌పై నటి ఫరియా అబ్దుల్లా క్రేజీ కామెంట్స్!
-
Afghanistan: ‘ఇన్షా అల్లాహ్.. తగిన సమాధానం ఇస్తాం’.. పాక్‌కు తాలిబన్ల హెచ్చరిక
-
NSE Listing: బీఎస్ఈలో ఎన్ఎస్ఈ గ్రాండ్ ఎంట్రీ.. లిస్టింగ్ అయిన గంటలోనే కోటి షేర్లు ట్రేడ్!
-
Employee Salary: ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 5 రోజుల ముందుగానే అకౌంట్లోకి సెప్టెంబర్ నెల జీతం..
-
DSP Bheem Reddy : భీమ్ రెడ్డి బినామీలపై ఏసీబీ ఫోకస్.. 8 ఇళ్లలో ఏకకాలంలో సోదాలు
ట్రెండింగ్
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!
-
150+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో Xiaomi Watch S5, Smart Band 11 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే.!
-
100W ఫాస్ట్ ఛార్జింగ్, 200MP కెమెరా, 120Hz LTPO డిస్ప్లేతో Xiaomi 18 Pro లాంచ్.!