NTV Telugu Site icon

Tejaswi Yadav: ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్.. ఆ పార్టీ సిద్ధాంతాలను అనుసరిస్తాడు..!

Tejaswi Yadav

Tejaswi Yadav

Prashant kishore: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బీజేపీ ఏజెంట్ అని బిహార్ మాజీ డిప్యూటీ సీఎం, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఆరోపించారు. పీకే ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎన్నికల్లో ఓడిపోతుందని.. అందుకే మూడు, నాలుగు రౌండ్ల ఓటింగ్ తర్వాత తమకు మద్దతు ఇవ్వాలని ప్రశాంత్‌ను పిలిచారని ఆయన పేర్కొన్నారు. అమిత్ షా కోరిక మేరకు ప్రశాంత్ కిషోర్‌ను జేడీయూ జాతీయ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు నితీశ్ కుమార్ చెప్పారనే విషయాన్ని గుర్తు చేశారు. కానీ, ఇప్పటి వరకు అమిత్ షా, ప్రశాంత్ కిషోర్ లు ఈ వాదనను ఖండించలేదన్నారు. పీకే మొదటి నుంచి బీజేపీలోనే ఉన్నారనే విషయం అర్థమవుతోందని తేజస్వీ యాదవ్ వెల్లడించారు.

Read Also: Devara : పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్.. ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్..

ఇక, ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీలో చేరినా ఆ పార్టీ సర్వనాశనం అవుతుందని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. ఇంతకీ ఆయనకి డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు.. అతను ప్రతి ఏటా వివిధ వ్యక్తులతో కలిసి పని చేస్తూన్నాడు.. వారి దగ్గరి నుంచి డేటా సేకరించి మరొకరికి అమ్మేసుకుంటాడు.. ఆయన కేవలం బీజేపీ ఏజెంట్ మాత్రమే కాదు.. వారి సిద్ధాంతాలను అనుసరిస్తాడని ఆరోపించారు. కాషాయ పార్టీ వ్యూహంలో భాగంగానే ప్రశాంత్‌కు నిధులు వస్తున్నాయని తెలిపారు. కాగా, 2019 లోక్‌సభ ఎన్నికలకు నెలల ముందు పీకే జేడీయూలో చేరారు.. అయితే, 2020లో సీఏఏపై పార్టీ వైఖరిపై ప్రశాంత్ కిషోర్ చేసిన విమర్శలతో ఆయనను జేడీయూ బహిష్కరించింది అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ చెప్పుకొచ్చారు.