NTV Telugu Site icon

Prashant kishor: ఇండియాలో మరో కొత్త పార్టీ.. అక్టోబర్ 2న ప్రారంభించనున్న ప్రశాంత్ కిషోర్

Kisht

Kisht

దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఫలితాలు వచ్చాయి.. ఎవరికి ఏ స్థానమో తేలిపోయింది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాజకీయాలు కూల్‌గా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గాంధీ జయంతి రోజున ఆయన కొత్త పార్టీని ప్రారంభించేందుకు రెడీ అయ్యారు. అక్టోబర్ 2న జన్ సూరాజ్ పార్టీని ప్రశాంత్ కిషోర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు.

ఇది కూడా చదవండి: Bangladeshi MP Murder: దిండుతో అదిమి, గొంతు నులిమి బంగ్లాదేశ్ ఎంపీ హత్య..

ప్రశాంత్ కిషోర్.. ఆయా రాజకీయ పార్టీలకు రాజకీయ వ్యూహకర్తగా పని చేశారు. బీజేపీ, కాంగ్రెస్, ఆప్, వైసీపీ, డీఎంకే, టీఎంసీ పార్టీలకు వ్యూహకర్తగా పని చేసిన అనుభవం ఉంది. బీహార్‌లోని జేడీయూ నేతగా ఉన్నారు. అయితే 2019లో పౌరసత్వ సవరణ చట్టంపై నితీష్ కుమార్ అవలంభించిన అనుకూల వైఖరిని విమర్శించినందుకు.. ఆయనను 2020, జనవరి 29న పార్టీ నుంచి బహిష్కరించారు. ఇక రాజకీయాల్లోకి రాకముందు ఐదేళ్ల పాటు ఐక్యరాజ్యసమితిలో పని చేశారు.

ఇది కూడా చదవండి: PM Modi: ఇటలీ బయల్దేరిన మోడీ.. జీ 7 సదస్సుకు హాజరు

కాంగ్రెస్, బీజేపీకి ఎన్నికల వ్యూహకర్తగా పని చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో 2012లో మూడోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యేందుకు మోడీకి సాయం చేశారు. అనంతరం 2014లో కేంద్రంలో బీజేపీ సంపూర్ణ మెజార్టీ సాధించేందుకు కృషి చేశారు. ఇక 2019లో ఏపీలో వైసీపీకి, 2020లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీకి, 2021లో బెంగాల్‌లో టీఎంసీకి కిషోర్ పనిచేశారు.

ఇది కూడా చదవండి: Largest Cities In World: ప్రపంచంలోనే అతిపెద్ద నగరాలేవో తెలుసా..