Jan Suraj Party Meeting: బీహార్ లోని గయాలో జన్ సూరజ్ పార్టీ సమావేశంలో తీవ్ర దుమారం రేగింది. పార్టీ కార్యకర్తలు ఘర్షణకు దిగి విధ్వంసానికి పాల్పడ్డారు. అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపిక కోసం ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ పార్టీ ఈ సమావేశానికి పిలుపునిచ్చింది. బెళగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి ముస్లిం అభ్యర్థికి టిక్కెట్టు ప్రకటించడంపై సమావేశంలో వాగ్వాదం చోటుచేసుకుంది. టికెట్ పోటీదారుల మద్దతుదారులు వీరంగం సృష్టించారు. శాంతి భద్రతలను కాపాడాలని పార్టీ కార్యకర్తలకు ప్రశాంత్ కిషోర్ విజ్ఞప్తి చేసినా వారు అంగీకరించలేదు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు చూస్తే..
Gold Rate Today: మగువలకు బ్యాడ్‌న్యూస్.. వరుసగా నాలుగోరోజు పెరిగిన బంగారం ధరలు!
బీహార్ అసెంబ్లీ ఉప ఎన్నిక అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ పార్టీ జన్ సూరజ్ పార్టీ గయాలో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. బెలగంజ్ అసెంబ్లీ స్థానం నుంచి తమ అభ్యర్థి పేరును ప్రకటించడమే ఈ సమావేశం ఉద్దేశం. ఈ స్థానం నుంచి ముస్లిం అభ్యర్థిని బరిలోకి దింపాలని పార్టీ నిర్ణయించింది. అయితే, పార్టీ తరపున ప్రశాంత్ కిషోర్ విలేకరుల సమావేశంలో అభ్యర్థి పేరును ప్రకటించబోతున్న వెంటనే, సమావేశానికి హాజరైన ఒక వర్గం కార్యకర్తలు రెచ్చిపోయారు. బెళగంజ్ నుంచి ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న నేతల మద్దతుదారులు పార్టీ నిర్ణయంపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.
Telangana MLA: ఎమ్మెల్యేను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు.. అర్థరాత్రి న్యూడ్ వీడియో కాల్..
ఈ సందర్భంగా నినాదాల మధ్య కుర్చీలు కూడా విరిగిపోయాయి. శాంతిభద్రతలను కాపాడాలని, ఎలాంటి ఒత్తిడికి గురికావద్దని ప్రశాంత్ కిషోర్ వేదికపై నుంచి కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు. అయినా కానీ వారు మాట వినలేదు. జన్ సూరజ్ పార్టీ ఎవరి ఒత్తిళ్లతో పని చేయదని ఆయన స్పష్టం చేశారు. బెలగంజ్ అసెంబ్లీ స్థానం నుండి ఉప ఎన్నిక కోసం జన్ సూరజ్ పార్టీ నాలుగు పేర్లను పరిశీలించారు. ఈ నలుగురు పేర్లలో మహ్మద్ అమ్జాద్ హసన్, ప్రొఫెసర్ ఖిలాఫత్ హుస్సేన్, మహ్మద్ డానిష్ ముఖియా, ప్రొఫెసర్ సర్ఫరాజ్ ఖాన్ ఉన్నారు. ఈ సమావేశంలోనే, అమ్జద్ హసన్‌కు మద్దతుగా డానిష్ ముఖియా తన పేరును వేదికపై నుండి ఉపసంహరించుకున్నాడు. ఆ తర్వాత సర్ఫరాజ్ ఖాన్ కూడా తన వాదనను విరమించుకున్నాడు. దాంతో పోటీ అమ్జాద్ హసన్, ఖిలాఫత్ హుస్సేన్ మధ్య మిగిలిపోయింది. అయితే, ఈ స్థానం నుంచి మైనారిటీ వర్గానికి చెందిన అభ్యర్థిని మాత్రమే బరిలోకి దింపాలని.. బెళగంజ్ ప్రజలు, పార్టీ నిర్ణయించినట్లు ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు. దాంతో అమ్జద్ హసన్ మద్దతుదారులు నినాదాలు చేయడం ప్రారంభించారు.